నందమూరి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న సూపర్ హిట్ టాక్ షో 'అన్‌స్టాపబుల్' విత్ NBK సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు విచ్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇందులో చంద్రబాబు ఎన్నో విషయాలను పంచుకున్నారు. చంద్రబాబు అరెస్టు, జైలులో గడిపిన క్షణాలను ఈ ఎపిసోడ్ పంచుకున్నట్లు ప్రోమోలో చూపించారు.
తప్పు చేసిన వాడిని వదిలిపెట్టనని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు జాతి నెం.1 ఉండాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు. ఇదిలా ఉంటే ఇదే షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా వచ్చినట్లు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న సమయంలో ఎన్టీఆర్.. మామ అరెస్ట్ పై ఎలాంటి స్పందన కనబరచలేదు.
Also Read : ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నయనతార ఎమోషనల్ పోస్ట్
పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా..
ఇదే అంశంపై బాలయ్య.. చంద్రబాబును ప్రశ్నించారని, అలాగే తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచిందట. వీటికి చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఎవరి కోసమో చూస్తూ కూర్చోదని, అలాగే వారసత్వం అనేది ఉందని, కార్యకర్తగా మొదలై, నాయకుడిగా ఎదిగి తనను తాను ప్రూవ్ చేసుకున్న వారికే పగ్గాలు అందుతాయని షోలో బాలయ్యతో ఓ సందర్భంలో చంద్రబాబు చెప్పినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ అక్టోబర్ 25న 'ఆహా' ఓటీటీలో టెలికాస్ట్ కానుంది.
Also Read : 'దేవర' నుంచి ఆయుధ పూజ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..