/rtv/media/media_files/2025/09/18/akhanda-2-update-2025-09-18-11-55-24.jpg)
Akhanda 2 Update
Akhanda 2 Update: నందమూరి బాలకృష్ణ(Balakrishna) - బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మొదట దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ అనుకోని కారణాల వల్ల సినిమా పోస్టుపోన్ అయ్యింది.
బాలయ్య డబ్బింగ్ పూర్తి
ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశకు చేరగా, తాజాగా బాలయ్య తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. డబ్బింగ్ స్టూడియోలో తీసిన ఓ ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు.
Also Read: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!
స్పెషల్ పార్టీ సాంగ్ షూటింగ్ స్టార్ట్
ఇక తాజా అప్‌డేట్ ప్రకారం, మేకర్స్ ఒక ప్రత్యేక “పార్టీ సాంగ్” ను తెరకెక్కిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో జరుగుతోంది. ఈ సాంగ్ పూర్తయిన వెంటనే సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అంటే సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమే అని చెప్పొచ్చు.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!
అఖండ సీక్వెల్‌పై భారీ అంచనాలు
‘అఖండ’ సెన్సేషనల్ హిట్ కావడంతో, ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. బాలయ్య మాస్ లుక్, పవర్‌ఫుల్ యాక్షన్ సీన్‌లు, తమన్ అందించిన మ్యూజిక్ అన్ని కలిపి ఈ సినిమా ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తమన్ సంగీతం అందించడంతో పాటలు, బీజీఎంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో రాజకీయ అంశాలు, సాంఘిక సందేశాలు కూడా ఉంటాయని సమాచారం. భారీ సెట్‌లు, విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
విడుదల తేదీ
ఇప్పటికే సినిమా దాదాపు పూర్తయినందున, మేకర్స్ త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న అఖండ 2 మళ్లీ బాలయ్య మార్క్ మాస్ మానియాను తెరపై చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి!