Akhanda 2 Review: ‘అఖండ 2: తాండవం’ తన్నేసిందా..? మూవీ రివ్యూ ఇదిగో..!

అఖండ 2: తాండవం రివ్యూ - బాలకృష్ణ నటన, తమన్ సంగీతం, మాస్ యాక్షన్ ప్రధాన ఆకర్షణలు. కథ సాధారణంగా ఉండటం, కొన్ని పాత్రలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మైనస్‌గా మారాయి. అయినప్పటికీ సినిమా వినోదాత్మకంగా, మాస్ ప్రేక్షకులు, అభిమానులు ఆనందించే విధంగా ఉంది.

New Update
Akhanda 2  Review

Akhanda 2 Review

Akhanda 2 Review: బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా, సమ్యుక్త హీరోయిన్ గా, ఆదీ పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, సస్వత చట్టర్జీ వంటి ప్రముఖ నటులతో తెరకెక్కిన ‘అఖండ 2: తాండవం’ సినిమా ఈరోజు డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 11 రాత్రి నుండి ప్రీమియర్ షోలతో ప్రారంభమైన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. రామ్ అచంట మరియు గోపీ అచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.

2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ అఖండ కి కొనసాగింపుగా వచ్చిన ‘అఖండ 2: తాండవం’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదట సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా, ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడింది. సమస్యలు క్లియర్ అయిన తర్వాత, సినిమా ఇప్పుడు 2D, 3D ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

Also Read: హ్యాపీ బర్త్ డే తలైవా..! స్టైల్‌, స్వాగ్‌, మ్యానరిజమ్స్‌కి వన్‌ & ఓన్లీ సూపర్‌స్టార్‌.

కథ:

టిబెట్ సైన్యం భారత్‌పై బయోలాజికల్ దాడి చేయాలని ప్రణాళిక చేస్తుంది. దీని కోసం మహా కుంభమేళాను మొదటి లక్ష్యంగా ఎంచుకుంటారు. దేశంలో పరిస్థితి క్షీణించడంతో, ప్రధానమంత్రి DRDOకి వెంటనే యాంటీ డాట్ తయారు చేయమని ఆదేశిస్తాడు. యువ శాస్త్రవేత్త జనని (హర్షాలి మల్హోత్రా) ఆ యాంటీ డాట్ ను తయారు చేస్తుంది. కానీ శత్రువులు ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో, తనకు ఎప్పుడైనా ప్రమాదం వస్తే తిరిగి వస్తానని వాగ్దానం చేసిన అఖండ (బాలకృష్ణ) మళ్లీ అవతరిస్తాడు. జననిని ఎలా కాపాడాడు? బయోవార్‌ను ఎలా అడ్డుకున్నాడు? దేశంలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు? అనేదే సినిమా ప్రధాన కథ.

ప్లస్ పాయింట్లు:

బాలకృష్ణ ఈ సారి కూడా అఖండగా అద్భుతంగా నటించాడు. ఆయన డైలాగులు, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ముఖ్య బలంగా నిలిచాయి. హర్షాలి మల్హోత్రా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది, ఆమె నటన కూడా బాగుంది. సమ్యుక్త పాత్ర చిన్నదైనా, కొత్తగా ప్రయత్నించింది. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన యాక్షన్ సన్నివేశాలు బాగా పనిచేశాయి. లాజిక్ పక్కన పెడితే, ఆ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రెండో భాగంలో వచ్చే శివుడి దర్శనం బాగా కనెక్ట్ అయ్యింది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఫైట్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది.

Also Read: తలైవా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ‘నరసింహ’ మళ్లీ థియేటర్లలో..!

మైనస్ పాయింట్లు:

సినిమాకు బలమైన కథ అంతగా లేదు. బోయపాటి ప్రధానంగా అఖండ ఎలివేషన్ మీద దృష్టి పెట్టాడు. బాలకృష్ణ చేసిన బల మురళీకృష్ణ పాత్రకు తక్కువ స్క్రీన్ టైమ్ ఇచ్చారు. చాలామంది పాత్రలను పరిచయం చేసినా, వారిని సరిగ్గా ఉపయోగించలేదు. సమ్యుక్త పాత్ర కొంచెం బలహీనంగా ఉంది. హర్షాలి పాత్రలో ఇంకా భావోద్వేగం చూపించే అవకాశం ఉన్నా, అది పూర్తిగా వినియోగించలేదు. కథలోని ప్రధాన పాయింట్లు మొదటి భాగానికే పరిమితమైనట్టు ఉంటాయి.

టెక్నికల్‌గా:

బోయపాటి తన స్టైల్‌కి తగట్టు యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌కి ప్రాధాన్యం ఇచ్చాడు. కొన్ని సన్నివేశాలు బాగా వర్కవ్వగా, కొన్ని మాత్రం సాదారణంగా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ మంచి స్థాయిలో ఉంది, ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో. ఎడిటింగ్ చక్కగా ఉంది. తమన్ సంగీతం మొత్తం సినిమాకే హైలైట్. నిర్మాణ విలువలు అద్భుతంగా కనిపిస్తాయి.

Also Read: 'అఖండ 2' దెబ్బ.. రోషన్ కనకాల 'మోగ్లీ' తట్టుకుంటుందా?

ఫైనల్ గా.. 
 
‘అఖండ 2: తాండవం’ ఒక మాస్, భక్తి కలయికతో వచ్చిన యాక్షన్ డ్రామా. కథ ఊహించదగినదైనా, బాలకృష్ణ నటన, తమన్ సంగీతం, మాస్ యాక్షన్ సీన్స్ సినిమాను నడిపిస్తాయి. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే కొంచెం తగ్గినట్టే అనిపించినా, అభిమానులకు మాత్రం కావాల్సిన మాస్, ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి.

మాస్ ప్రేక్షకులు, బాలయ్య అభిమానులు ఖచ్చితంగా ఆస్వాదించే సినిమా ‘అఖండ 2: తాండవం’.

Advertisment
తాజా కథనాలు