/rtv/media/media_files/dxWYN9FeqOYQqNnJzwLt.jpg)
జబర్దస్త్ వేణుగా అందరికీ పరిచయమైన వేణు.. ఇప్పుడు బలగం వేణుగా మారిపోయాడు. బలగం సినిమాతో దర్శకునిగా కెరీర్ స్టార్ట్ చేసిన వేణు మొదటి సినిమాకే భారీ హిట్ కొట్టేశారు. చిన్న సినిమాగా రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొని ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. అలాగే విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
'బలగం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. తన తర్వాతి ప్రాజెక్ట్ ను ఇటీవలే ప్రకటించాడు. తన రెండో సినిమాకు 'ఎల్లమ్మ' అనే టైటిల్ ను లాక్ చేశాడు. ఇందులో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. రీసెంట్ గా నాని కూడా వేణుతో సినిమా నిజమే అని చెప్పాడు.
Also Read : క్రేజీ అప్డేట్.. బాలయ్య సూపర్ హీరోగా, ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా..?
కానీ అది ఇంకా చర్చల దశలోనే ఉందని చెప్పాడు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించి అప్‌డేట్ వచ్చింది. 'జనక అయితే గనక' సినిమా ఈవెంట్‌లో 'బలగం' వేణుని నిర్మాత దిల్ రాజు అడుగుతూ.. 'ఎల్లమ్మ' ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? అని అడగ్గా.. దీనికి వేణు సమాధానమిస్తూ..' సార్ అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇప్పుడు మొదలుపెట్టమన్నా స్టార్ట్ చేస్తాను. నవంబర్ నుంచి స్టార్ట్ చేద్దామా..' అని అన్నాడు.
#Yellamma shoot starts in February. But who is the hero? Nani or Nithiin or anyone else? pic.twitter.com/GzLRZI229i
— Aakashavaani (@TheAakashavaani) October 10, 2024
ఫిబ్రవరి నుంచి మొదలు..
దానికి దిల్ రాజు..వద్దు సామీ, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పారు. దీంతో ఈ మూవీ పిబ్రవరిలో స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ నుంచి నాని తప్పుకున్నాడని, అతని ప్లేస్ లో నితిన్ ను సెలెక్ట్ చేసారని ఇటీవల ప్రచారం జరిగింది. మరి 'ఎల్లమ్మ' మూవీలో హీరో ఎవరనేది తెలియాలంటే దీనిపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.