/rtv/media/media_files/T6dg42GFWQTDHLoCt9bV.jpg)
నటసింహం నందమూరి బాలకృష్ణకు సంబంధించి ఓ షాకింగ్ అప్డేట్ బయటికొచ్చింది. ఈసారి బాలయ్య సూపర్ హీరో అవతారం ఎత్తనున్నారట. బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ మాసివ్ సినిమా రాబోతుందని సమాచారం. దసరా కానుకగా దీనికి సంబంధించిన అప్డేట్ రేపు అక్టోబర్ 12న వస్తుందని సమాచారం. బాలయ్య కొత్త మాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపిస్తారని, ఇందులో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా ఉండొచ్చని టాక్ కూడా వినిపిస్తుంది.
ఫ్యాన్స్ వెయిటింగ్..
దీంతో ఈ వార్త సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారింది. దీనికి సంబంధించి రేపు గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బాలయ్యని సరికొత్తగా చూపించబోతున్నారని తెలుస్తుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ న్యూస్ విని కొందరు అసలు ఈ ఏజ్ లో బాలయ్య సూపర్ హీరో రోల్ చేయడం ఏంటని ? ఆయన్ని సూపర్ హీరోగా చూపించే సాహసం ఏ డైరెక్టర్ చేస్తున్నారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
#NandamuriBalakrishna as the MASSIEST SUPER HERO With #AishwaryaRaiBachchan joining NBK.
— Guruji (@Balayya001) October 11, 2024
Superhero mode ON! ⚡️#NandamuriBalakrishna is ready to make history with his latest role as the MASSIEST SUPERHERO 🔥
Official Announcement tomorrow, Oct 12th 💥 pic.twitter.com/WblAD0itmf
Also Read : కేరళ రోడ్లపై విజయ్ దేవరకొండ జాగింగ్.. రౌడీ హీరోను ఆపిన పోలీసులు
ఇక బాలయ్య వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK 109' మూవీ చేస్తున్నారు. మెగాస్టార్ కు 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
Breaking the mold! 🦸♂️ #NandamuriBalakrishna is stepping into a new era of Indian superheroes as the MASSIEST SUPER HERO 😍😍
— BA Raju's Team (@baraju_SuperHit) October 11, 2024
Official Announcement landing tomorrow 🔥 pic.twitter.com/2VZ7sXkGQj