/rtv/media/media_files/2025/10/30/baahubali-the-epic-2025-10-30-06-49-35.jpg)
Baahubali The Epic
Baahubali The Epic: దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) రూపొందించిన బాహుబలి సిరీస్ ఇప్పుడు కొత్త రూపంలో ప్రేక్షకులను అలరించనుంది. “బాహుబలి: ది ఎపిక్” అనే పేరుతో, బాహుబలి 1, 2 సినిమాలను కలిపి రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిట్ అక్టోబర్ 30న రాత్రి ప్రీమియర్స్ తో, అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈసారి సినిమా సుమారు 3 గంటలు 45 నిమిషాల నిడివితో రాబోతోంది. అసలు రెండు సినిమాల కలిపిన టైమ్ 5 గంటల కంటే ఎక్కువగా ఉండటంతో, దర్శకుడు కథను మెయిన్ స్టోరీ పరంగా సాగించేందుకు కొన్ని సన్నివేశాలు, పాటలు కత్తిరించారు.
Also Read: Deepika Padukone: “కల్కి 2898 AD”OTTలో దీపికా పదుకొనే పేరు మళ్లీ చేరింది! వివాదానికి తెరపడిందా?
The Chopped scenes and songs in #BaahubaliTheEpic from #Baahubali1 & #Baahubali2
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) October 29, 2025
Avantika Love Story
Pacchabottesina song
Irukkupo song
Kanna Nidurinchara song
Few War moments
- #SSRajamouli
pic.twitter.com/ZvWxhENdHr
Rajamouli Baahubali The Epic Interview
రాజమౌళి మాట్లాడుతూ, “ప్రతి సన్నివేశం కథలో ఒక భావనను చెప్పాలి. కొన్ని భాగాలు తీసివేశామంటే, కథకు అడ్డంకి అవ్వకూడదనే ఉద్దేశ్యంతో మాత్రమే” అని చెప్పారు. ఈ ఎడిటెడ్ వెర్షన్‌లో అవంతిక (తమన్నా), శివుడు (ప్రభాస్) మధ్య ప్రేమ కథ భాగం కొంతమేర తీసేశారట. అలాగే మూడు పాటలు “పచ్చ బొట్టేసినా”, “కన్నా నిదురించరా”, “ఇరుక్కుపో”(మనోహరి) ఈ కొత్త వెర్షన్‌లో లేవు.
Also Read: “స్పిరిట్”లో కొరియన్ యాక్షన్ స్టార్ 'మా డాంగ్-సియోక్'..? అప్‌డేట్ వచ్చేసింది.
యుద్ధ సన్నివేశాలుకు కూడా కొంతవరకు కత్తెరవేశారట. భారీ యాక్షన్ సీన్లు ఉన్నప్పటికీ, ప్రధాన భావోద్వేగాలను అలాగే ఉంచి, కథను వేగంగా చెప్పే విధంగా మార్చారు. సినిమా మొత్తం కథపైనే దృష్టి పెట్టి, ప్రేక్షకులకు ఎలాంటి విరామం లేకుండా మంచి అనుభూతిని ఇవ్వడం లక్ష్యమని టీమ్ తెలిపింది.
ఇక బాక్స్‌ఆఫీస్ విషయానికి వస్తే, రిలీజ్‌కి ముందే ఈ సినిమా సంచలనాన్ని సృష్టిస్తోంది. ప్రీ-బుకింగ్స్‌లోనే భారీ రికార్డులు నెలకొన్నాయి. కేవలం ప్రీ బుకింగ్స్ ద్వారానే సినిమా 9 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. హైదరాబాద్ నగరంలో మాత్రం ప్రత్యేకంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజు టికెట్ బుకింగ్స్ టాప్ రేంజ్‌లో సాగుతున్నాయి.
Also Read: హాట్ ఫోజులతో కుర్రకారు మతిపోగొడుతున్న బాలయ్య బ్యూటీ! ఈ పిక్స్ చూశారా
తాజా అంచనాల మధ్య, “బాహుబలి: ది ఎపిక్” రీ-రిలీజ్ సినిమాలలోనే అత్యధిక వసూళ్లు సాధించే అవకాశం ఉంది. తెలుగు మాత్రమే కాకుండా, హిందీ, తమిళ్, మలయాళం వంటి అన్ని భాషల్లోనూ మంచి బజ్ ఉంది. ప్రేక్షకుల కోసం మరోసారి ఈ మహా అద్భుతం తెరపైకి వస్తుండటంతో, “బాహుబలి” అభిమానులు మరలా మాహిష్మతి ప్రపంచంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.
Also Read: న్యూ*డ్ గా ప్రభాస్.. వైరల్ అవుతున్న 'స్పిరిట్' అప్డేట్!
Follow Us