Prabhas Spirit: “స్పిరిట్”లో కొరియన్ యాక్షన్ స్టార్ 'మా డాంగ్-సియోక్'..? అప్‌డేట్ వచ్చేసింది.

కొరియన్ స్టార్ మా డాంగ్-సియోక్, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “స్పిరిట్” చిత్రంలో విలన్‌గా నటించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా 2026లో ఎనిమిది భాషల్లో విడుదల కాబోతోంది.

New Update
Prabhas Spirit

Prabhas Spirit

Prabhas Spirit: ఇండియన్, కొరియన్ సినిమా ప్రపంచాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్”పై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది. ఈ సినిమా ద్వారా “ట్రైన్ టు బుసాన్”, “ఎక్స్‌ట్రాక్షన్: టైగో” సినిమాల హీరో మా డాంగ్-సియోక్ (Korean Actor Don Lee) ఇండియన్ సినీ రంగంలోకి అడుగుపెట్టనున్నారని కొరియన్ మీడియాలో దీనిపై సమాచారం వెలువడింది.

ప్రభాస్‌కి విలన్‌గా మా డాంగ్-సియోక్..

“స్పిరిట్” చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, మా డాంగ్-సియోక్ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. కొరియన్ సోషల్ మీడియా కమ్యూనిటీ “ముకో”లో ఈ వార్తను పంచుకుంటూ “ఈ చిత్రం డిటెక్టివ్ క్రైమ్ డ్రామా శైలిలో రూపొందుతోంది. ప్రభాస్ పాత్రకు విలన్ గా మా డాంగ్-సియోక్ నటిస్తారు” అని పేర్కొన్నారు.
ఇక ఇటీవల మా డాంగ్-సియోక్ ఇండియాకు వెళ్తున్న ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఈ సినిమా షూటింగ్‌తో సంబంధమున్నట్టు అభిమానులు ఊహిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే, ప్రభాస్ నటించిన “సలార్” సినిమా రిలీజ్ సమయంలో ఆయన దానికి ప్రశంసలు కూడా తెలిపారు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్.. 

“స్పిరిట్” సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక హై వోల్టేజ్ పోలీస్ యాక్షన్ డ్రామా‌గా తెరకెక్కుతుంది. ఇందులో ప్రభాస్ తో పాటు త్రిప్తి దిమ్రి, ప్రకాశ్ రాజ్, కంచన, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంతో భారీ గ్యాప్ తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాను భూషణ్ కుమార్ (టీ-సిరీస్) సండీప్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు వంగా ఒక సౌండ్ స్టోరీ టీజర్ విడుదల చేశారు. అది సినిమాకు సంబంధించిన టోన్, మ్యూజిక్ స్టైల్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేపింది. “స్పిరిట్” 2026లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మందారిన్, జపనీస్, కొరియన్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అత్యంత పెద్ద, గ్లోబల్ ఇండియన్ ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్నారు.

కొరియన్ స్టార్ మా డాంగ్-సియోక్, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “స్పిరిట్” చిత్రంలో విలన్‌గా నటించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా 2026లో ఎనిమిది భాషల్లో విడుదల కాబోతోంది. 

Advertisment
తాజా కథనాలు