Prabhas Spirit: న్యూడ్ గా ప్రభాస్.. వైరల్ అవుతున్న 'స్పిరిట్' అప్డేట్!

రెబల్ స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న  'స్పిరిట్' సినిమాపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.  యానిమల్, అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత సందీప్ రెడ్డి వంగా చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది.

New Update
prabhas spirit

prabhas spirit

Prabhas Spirit:  రెబల్ స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న  'స్పిరిట్' సినిమాపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.  యానిమల్, అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత సందీప్ రెడ్డి వంగా చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. సినిమా అప్డేట్లు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 

న్యూడ్ గా ప్రభాస్?

ఇటీవలే స్పిరిట్ నుంచి విడుదలైన ఓ ఆడియో టీజర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో జైలు సూపర్ ఇండెంట్ గా ప్రకాష్ రాజ్.. ఖైదీ వచ్చిన ప్రభాస్ ను.. "వీడి (ప్రభాస్) బట్టలూడదీసి మెడికల్ టెస్ట్‌కు పంపించండి" అనే డైలాగ్ ఇపుడు నెట్టింట రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. ఈ డైలాగ్ ఆధారంగా సినిమాలోని ఓ సన్నివేశంలో ప్రభాస్ న్యూడ్ గా కనిపిస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి.   సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలు చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంటారు. గతంలో ఆయన తీసిన బ్లాక్ బస్టర్ "యానిమల్" సినిమాలోనూ   హీరోను నగ్నంగా చూపించారు. దీంతో ఇప్పుడు  'స్పిరిట్' లోనూ వంగా అదే స్టైల్ ను ఫాలో అవుతున్నారా? అని అనుకుంటున్నారు అభిమానులు.

అయితే ఈ న్యూడ్ సీన్ లో ప్రభాస్ స్వయంగా నటిస్తారా? లేదా బాడీ డబుల్ ఉపయోగిస్తారా అనేది తెలియదు. దీనిపై వంగా క్లారిటీ ఇచ్చే వరకు.. సోషల్ మీడియాలో ఈ అంశం గురించిన చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. సందీప్ రెడ్డి వంగా సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్, టీ- సీరిస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించబోతున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. 

Also Read: The Family Man 3: 'ది ఫ్యామిలీ మ్యాన్' మళ్ళీ వచ్చేస్తున్నాడు.. సీజన్ 3 లో సామ్ రోల్ ఇదేనా

Advertisment
తాజా కథనాలు