Baahubali The Epic: సీన్ బై సీన్ జక్కన్న చేసిన మార్పులు ఇవే..! ఈసారి ఎన్ని రికార్డులు లేస్తాయో..!

బాక్సఫిస్ రికార్డులను తిరగరాసిన 'బాహుబలి' పదేళ్ల తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. పార్ట్ 1, పార్ట్ 2 రెండు కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు రాజమౌళి. ఆయితే ఈ మూవీలో చేసిన మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

New Update
Baahubali The Epic

Baahubali The Epic

Baahubali The Epic: కరోనా తర్వాత తెలుగు సినిమాల్లో రీ–రిలీజ్‌ల ట్రెండ్ బాగా పాపులర్ అయ్యింది. పాత హిట్ సినిమాలు మళ్లీ థియేటర్లకు వచ్చాయి. కొన్నింటిని ప్రజలు అంతగా పట్టించుకోలేదు, కానీ కొన్నింటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు మన అందరి అభిమాన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) కూడా ఆ ట్రెండ్‌లో చేరాడు. రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్ (2015), బాహుబలి 2: ది కన్క్లూజన్ (2017) సినిమాలను మళ్లీ విడిగా కాకుండా, ఒకే భారీ సినిమాగా మూడు గంటల 45 నిమిషాలతో “బాహుబలి: ది ఎపిక్” పేరుతో రిలీజ్ చేశారు. ఈ కొత్త వెర్షన్‌లో కథ అదే అయినా, అనుభవం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. రాజమౌళి కొన్ని సీన్లు కట్ చేసి, కొన్ని మళ్లీ రీ సెట్ చేసి, మొత్తం కథను ఒకటిగా మలిచారు. దీనివల్ల కథ మరింత డెప్త్ గా, గ్రిప్పింగ్ గా నడుస్తుంది.

Also Read: రాజమౌళి మాయాజాలం.. 'బాహుబలి: ది ఎపిక్' ఎలా ఉందంటే..?

రాజమౌళిని జక్కన్న అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

రాజమౌళిని అభిమానులు “జక్కన్న” అని ఎందుకు పిలుస్తారంటే, ఆయన ప్రతి పనిలో పర్ఫెక్షన్ చూపుతారు. ప్రేక్షకులకు కథ ముందే తెలిసినా కూడా, ఆయన దాన్ని కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తారు.

అయితే, ఈ కొత్త వెర్షన్ మొదటి టైటిల్ కార్డ్ నుంచే అది కనిపిస్తుంది. పాత టైటిల్‌ని కాకుండా, కొత్తగా డిజైన్ చేసిన గ్రాఫిక్స్‌తో సినిమా మొదలవుతుంది. అంటే “మీకు ఈ కథ ముందే తెలిసినా, ఇలా ఎప్పుడూ చూడలేదు కదా!” అని రాజమౌళి మనకి చెబుతున్నట్టు ఉంటుంది. బాహుబలి మునపటి సినిమా లాగే శివగామి (రామ్యకృష్ణ) బిడ్డను చేతిలో పట్టుకుని సైనికుల నుంచి పారిపోతూ నది వైపు వెళ్లే సీన్ తో సినిమా మొదలవుతుంది. ఆ సన్నివేశాలు మార్చలేదు. కానీ తరువాతి సీన్స్‌లో కొంచెం మార్పులు ఉన్నాయి. బాహుబలి చిన్నప్పుడు సన్నివేశాలు కొంచెం మార్చారు. వెంటనే మొదట శివలింగాన్ని ఎత్తే సీన్ వస్తుంది, ఆ తరువాత మాస్క్ దొరకడం, ఆ తర్వాత “అమ్మా, పైన ఏముంది?” అని అడగడం. ఇలా సినిమాకి మంచి ఫ్లో వచ్చింది “దీవరా” పాట కూడా ఇప్పుడు బాగా సెట్ అయింది. చిన్న చిన్న డైలాగ్స్, కామెడీ సీన్స్ తీసేశారు.

Also Read: రవితేజ 'మాస్ జాతర' కు 'బాహుబలి' రీరిలీజ్ దెబ్బ.. ఇలా జరిగిందేంటి!

అవంతిక పాత్రను చాలా వరకు తొలగించారు.

తమన్నా చేసిన అవంతిక పాత్ర చాల పెద్దగా ఉండేది కానీ ఇప్పుడు చిన్నదిగా మార్చారు. ఆమె కథను రాజమౌళి తన వాయిస్‌తోనే నేరేట్ చేశారు. రాజమౌళి మాట్లాడుతూ ఆమె ఎవరు, బాహుబలిని ఎలా కలిసింది, ఎలా ప్రేమలో పడింది అన్నీ చెబుతారు. పాటలు, రొమాంటిక్ సీన్స్ అన్నీ తొలగించారు కానీ కథ సారాంశం మాత్రం అలాగే ఉంది. కట్టప్ప (సత్యరాజ్) మొదటి సీన్‌లో కిచ్చా సుదీప్ ఉన్న భాగాన్ని కూడా పూర్తిగా తీసేశారు.

మహిష్మతి రాజ్యం - బాహుబలి తిరిగి రావడం

మహిష్మతిలో జరిగే సీన్స్ మరింత ఫాస్ట్‌గా జరుగుతాయి. భల్లాలదేవ (రానా) రాజ్యంలోని దున్నపోతుతో ఫైట్ చేసే షాట్లు కొంచెం కట్ చేశారు. తర్వాత ప్రజలు బాహుబలిని గుర్తించే సీన్స్‌ ఉంటాయి. భల్లాలదేవుడి బంగారు విగ్రహం సీన్ కొంత చిన్నది చేసారు. కానీ దాని ప్రభావం మాత్రం అలాగే ఉంది. దేవసేన (అనుష్క)ను రక్షించే భాగం అలాగే ఉంది, కానీ కొన్ని షాట్లు తక్కువ చేశారు. కట్టప్ప బాహుబలి కాళ్లను తలపై పెట్టుకునే సీన్, మొదటి యుద్ధ సీక్వెన్స్ అన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు యుద్ధం మరింత కాంపాక్ట్‌గా ఉంటుంది. బాహుబలి పార్ట్ 1 సినిమా చివరలో ఉండే “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనే సీన్ ఇప్పుడు ఎపిక్ లో ఇంటర్వల్ పాయింట్‌కి మార్చారు. ఇంటర్వెల్ కి స్క్రీన్‌పై వచ్చే సెంటెన్స్ కూడా బాగుంది - “ఇప్పుడు WKKB కోసం రెండేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు!” అని రాసి ఉంటుంది. ఆ డైలాగ్ చూసి థియేటర్‌లో ప్రేక్షకులు ఆనందంతో చప్పట్లు కొట్టేశారు.

Also Read: బాహుబలి ఎపిక్  కొత్త సీన్స్..గూస్ బంప్స్ గ్యారంటీ అంటున్న జనాలు

ఇంటర్వెల్ తర్వాత.. 

ఇంటర్వెల్ తర్వాత “బాహుబలి 2” నుంచి మొదలవుతుంది. పండుగ సీన్, “సాహోరే బాహుబలి” పాటలో కొన్ని భాగాలు తీసేశారు. శివగామి భల్లాలదేవుడి కోసం వధువును వెతికే సీన్ కూడా కాస్త కుదించారు. దేవసేన ఎంట్రీ, ఆమెతో బాహుబలి ప్రేమ, కట్టప్పతో ఉన్న కామెడీ సన్నివేశాలు కొంత తగ్గించారు. కానీ సినిమాలో మెయిన్ ఎమోషన్ ఎక్కడ మిస్ అవ్వదు. కొన్ని పాటలు, కామెడీ సీన్స్ తీసేశారు. అయినా కానీ అమరేంద్ర బాహుబలి, దేవసేన మధ్య ఉన్న ప్రేమ మాత్రం మరింత బలంగా అనిపిస్తుంది. భావోద్వేగాలు అలాగే ఉన్నాయి.

బాహుబలి కుంతల రాజ్యాన్ని రక్షించే సీన్ నుంచి చివరి వరకు సినిమా చాలా గ్రిప్పింగ్ గా నడుస్తుంది. బాహుబలి మరణం, శివగామి పశ్చాత్తాపం, మహేంద్ర బాహుబలి పోరాటం చేసి రాజుగా ఎదిగే సీన్స్ అన్నీ అలాగే ఉన్నాయి. చివరి యుద్ధం కొంచెం చిన్నదిగా ఉన్నా చాల బాగా కట్ చేసారు. చివర్లో టైటిల్ క్రెడిట్స్ బదులుగా రాజమౌళి అందరికీ ధన్యవాదాలు చెప్పే చిన్న మెసేజ్‌తో సినిమా ముగుస్తుంది.

Also Read: 'బాహుబలి ది ఎపిక్' ఊచకోత.. థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

చివరి సర్‌ప్రైజ్.. కొత్త బాహుబలి యూనివర్స్

సినిమా ముగిసిందని అనుకుంటున్నంతలో, స్క్రీన్ మీద మరో పెద్ద సర్‌ప్రైజ్ వచ్చింది. అదే “Baahubali: The Eternal War – Part 1” అనే కొత్త యానిమేటెడ్ సినిమా టీజర్! ఇది రాజమౌళి దర్శకత్వం కాకపోయినా, ఆయన ప్రెజెంట్ చేస్తున్నారు. ఇషాన్ శుక్లా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టీజర్‌లో శివగామి వాయిస్‌తో మొదలై, దేవతల ప్రపంచంలో జరిగే యుద్ధ సన్నివేశాలు చూపించారు. చివర్లో ప్రభాస్ వాయిస్‌తో “నాదీ అదే ప్రశ్న ఇంద్రా.. నిన్ను ఎవరు కాపాడుతారా అని..?” అని వచ్చే డైలాగ్‌తో థియేటర్‌ దద్దరిల్లిపోయింది. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. 

ఇప్పుడు ఈ నాలుగు గంటల బాహుబలి సినిమా చూస్తే, ఇది రాజమౌళి మొదట అనుకున్న ఒరిజినల్ ప్లాన్ అని అనిపిస్తుంది. ఆ సమయంలో ఇంత పొడవైన సినిమా చేయడం సాధ్యంకాదు, కాబట్టి ఆయన రెండు భాగాలుగా విభజించారు. ఇప్పుడు అయితే ప్రేక్షకులు పెద్ద సినిమాలు చూడటానికి రెడీగా ఉన్నారు. తాజా టెక్నాలజీతో సినిమా ఇంకా అందంగా కనిపిస్తుంది. సౌండ్, విజువల్స్ మరింత రిచ్‌గా ఉన్నాయి. ప్రతి సీన్‌లో రాజమౌళి పర్ఫెక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది.

“బాహుబలి: ది ఎపిక్” కేవలం రీ-రిలీజ్ కాదు. ఇది ఒక కొత్త అనుభవం. రాజమౌళి తన మాస్టర్‌పీస్‌ని మళ్లీ సరికొత్తగా తీర్చిదిద్దాడు. ఇది చూసిన తర్వాత బాహుబలి కేవలం సినిమా కాదు, అది మనకు గర్వంగా ఉండే ఒక లెజెండ్ అని అనిపించక మానదు. రాజమౌళి కేవలం సినిమాలు తీయడు, కళను సృష్టిస్తాడు.. అని మళ్ళీ  నిరూపించుకున్నాడు.

Advertisment
తాజా కథనాలు