Baahubali The Epic Review: 'బాహుబలి ది ఎపిక్' ఊచకోత.. థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన  'బాహుబలి' దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులను అలరించేందుకు తెరపైకి వచ్చింది. బాహుబలి పార్ట్ 1 అండ్ బాహుబలి పార్ట్ 2 రెండు భాగాలను కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు రాజమౌళి.

New Update
Baahubali The Epic

Baahubali The Epic

ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన  'బాహుబలి' దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులను అలరించేందుకు తెరపైకి వచ్చింది. బాహుబలి పార్ట్ 1 అండ్ బాహుబలి పార్ట్ 2 రెండు భాగాలను కలిపి దీనికి మరికొన్ని కొత్త హంగులను జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు రాజమౌళి. 'Baahubali The Epic' పేరుతో నేడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. ఇదొక రిలీజ్ అయినప్పటికీ.. ప్రేక్షకుల్లో ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియా, ట్విట్టర్ ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ అవుతోంది. పదేళ్ల తర్వాత కూడా సినిమా చూస్తున్నప్పుడు అదే ఎమోషన్, అదే గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని, జక్కన్న రీ ఎడిటెడ్ వెర్షన్ అద్భుతమని కొనియాడుతున్నారు ప్రేక్షకులు. కథలో ఎక్కడా జంప్ లేకుండా ఫాస్ట్ ఎడిటింగ్ తో ప్రతీ సన్నివేశాన్ని కొత్తగా చూపిస్తూ మ్యాజిక్ క్రియేట్ చేశారు రాజమౌళి. ఫస్ట్ హాఫ్ అయితే ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా పరుగులు పెడుతోందని ప్రశంసిస్తున్నారు. 

దాదాపు 5 గంటలకు పైగా ఉండే రెండు భాగాలను 3 గంటల 45 నిమిషాలకు ఎడిట్ చేయడం వలన సినిమా చాలా క్రిస్ప్ గా ఉంది. అనవసరమైన పాటలు, సన్నివేశాలు ఎడిట్ చేయడంతో కథ మరింత ఆసక్తిగా సాగిందని రివ్యూయర్లు చెబుతున్నారు. రీ ఎడిటెడ్ వెర్షన్ లో ఎం.ఎం. కీరవాణి సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మరింత అద్భుతంగా అనిపించిందని అంటున్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ పెద్ద స్క్రీన్‌పై ఈ విజువల్స్‌ని చూడటం అభిమానులకు గూస్‌బంప్స్  మూమెంట్ అందించిందని, మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని చెబుతున్నారు. 

Also Read: Amitabh Bachchan : బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌కు ఖలిస్తానీ బెదిరింపులు.. భద్రత పెంపు!

Advertisment
తాజా కథనాలు