Bahubali The Epic: రవితేజ 'మాస్ జాతర' కు 'బాహుబలి' రీరిలీజ్ దెబ్బ.. ఇలా జరిగిందేంటి!

ప్రభాస్- రాజమౌళి కాంబోలో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'బాహుబలి' మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'బాహుబలి' రెండు భాగాలను కలిపి  'బాహుబలి: ది ఎపిక్' పేరుతో మళ్లీ విడుదల చేశారు మేకర్స్.

New Update
Bahubali the epic vs maas jathara

Bahubali the epic vs maas jathara

Bahubali The Epic: ప్రభాస్- రాజమౌళి కాంబోలో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'బాహుబలి' మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'బాహుబలి' రెండు భాగాలను కలిపి  'బాహుబలి: ది ఎపిక్' పేరుతో మళ్లీ విడుదల చేశారు మేకర్స్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రీ రిలీజైన ఈ చిత్రానికి సూపర్ హిట్ స్పందన వస్తోంది. విడుదలై పదేళ్లు గడిచిన  జనాల్లో బాహుబలి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రీ రిలీజ్ అయినప్పటికీ.. అభిమానులు, సినీ ప్రియుల నుంచి సినిమాకు ఊహించని రేంజ్ లో స్పందన వస్తోంది. కొత్తగా విడుదలైన  సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి టికెట్ బుకింగ్స్ లో దూసుకుపోతుంది.  తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వైజాగ్, విజయవాడతో పాటు ఓవర్సీస్‌లో కూడా అడ్వాన్స్ బుకింగ్‌లు రికార్డు స్థాయిలో జరిగాయి. చాలా థియేటర్లలో మొదటి రోజు ఫుల్ ఆక్యుపెన్సీ కనిపించింది. ఈరోజే విడుదలైన రవితేజ కొత్త సినిమా  'మాస్ జాతర' కంటే కూడా  'బాహుబలి' రీరిలీజ్ కు విశేష స్పందన లభిస్తోంది. 

బాహుబలి రీరిలీజ్ ఎఫెక్ట్ 

బాహుబలి రీరిలీజ్ రవితేజ 'మాస్ జాతర' కు బాగా దెబ్బేసినట్లు తెలుస్తోంది. బాహుబలి తెలిసిన కథే అయినప్పటికీ.. రాజమౌళి మాహిష్మతి సామ్రాజ్యాన్ని మరోసారి పెద్ద తెరపై చూసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు ప్రేక్షకులు. హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్స్ అన్నింటిలోనూ  'బాహుబలి' రీరిలీజ్ షోలు హౌజ్ ఫుల్ అయిపోగా.. మాస్ జాతరకు చాలా తక్కువ ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందని టాక్. 'బాహుబలి' ధాటికి ఒక స్టార్ హీరో కొత్త సినిమాకు ఉండాల్సిన కనీస హైప్ కూడా 'మాస్ జాతర' కి దక్కడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, అడ్వాన్స్ బుకింగ్‌లలో 'మాస్ జాతర' కంటే 'బాహుబలి: ది ఎపిక్' కలెక్షన్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. మాస్ హీరో కొత్త చిత్రం కంటే రీ-రిలీజ్ సినిమా డామినేట్ చేయడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 

Also Read: Mass Jathara Review: మాస్ మహారాజ్ 'మాస్ జాతర' హిట్టా? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే

Advertisment
తాజా కథనాలు