Baahubali The Epic Review: రాజమౌళి మాయాజాలం.. 'బాహుబలి: ది ఎపిక్' ఎలా ఉందంటే..?

“బాహుబలి: ది ఎపిక్” ప్రీమియర్ షోస్ పూర్తయ్యాయి. రాజమౌళి కొత్త ఎడిటింగ్, విజువల్స్‌తో అద్భుతంగా చూపించారు. ప్రభాస్ నటన, కీరవాణి సంగీతం, ఎమోషనల్ క్లైమాక్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. చివర్లో “బాహుబలి: ది ఎటర్నల్ వార్” టీజర్ చూపించారు.

author-image
By Lok Prakash
New Update
Baahubali The Epic Review

Baahubali The Epic Review

Baahubali The Epic Review: భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన సినిమా “బాహుబలి”. ఇప్పుడు అదే మహా గాథ, కొత్త రూపంలో మళ్లీ తెరపైకి వచ్చింది. “బాహుబలి: ది ఎపిక్” పేరుతో ఈ చిత్రాన్ని 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇది సాధారణ రీ-రిలీజ్ కాదు కొత్త ఎడిటింగ్, కొత్త సౌండ్ డిజైన్, అద్భుతమైన విజువల్ క్వాలిటీతో “ఎక్స్‌పీరియన్స్ ది ఎపిక్” అనే కాన్సెప్ట్‌పై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలోజ్‌కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగాయి. విదేశాల్లో ఒకరోజు ముందే విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్ దగ్గర నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంటుంది.

ఫస్ట్ హాఫ్: స్పీడ్ అండ్ స్పెషల్..!

సినిమా టైటిల్ కార్డ్‌ నుంచి మొదలుకొని ప్రేక్షకులకు ఇది మామూలు రీ-రిలీజ్ కాదన్న ఫీల్ తీసుకొచ్చింది.. రాజమౌళి తన ప్రత్యేక స్టైల్ లో సినిమా నడిపిస్తూ, ఫాస్ట్ ఎడిటింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని కొత్త లుక్‌లో చూపించారు. మహేంద్ర బాహుబలి మాహిష్మతిలో అడుగు పెట్టే సన్నివేశం, భల్లాలదేవుడి గ్రాండ్ ఎంట్రీ, ఇద్దరి మధ్య యుద్ధం ఇవన్నీ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్‌తో కనిపిస్తున్నాయి. అనుష్క ఎంట్రీ సీన్, కట్టప్ప బాహుబలిని పొడిచే ఇంటర్వెల్ సీక్వెన్స్‌కి థియేటర్లలో చప్పట్ల వర్షం కురిసింది. కీరవాణి సంగీతం మొదటి సారి చూసినప్పుడు ఎంత ఆకట్టుకుందో ఇప్పుడు అంతకు మించి అక్కట్టుకుంది.

సెకండ్ హాఫ్: ఎమోషన్, ఎపిక్ క్లైమాక్స్

సెకండ్ హాఫ్ లో రాజమౌళి(Rajamouli) డ్రామా, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో కథను నడిపించారు. “అమరేంద్ర బాహుబలి అనే నేను” ఎపిసోడ్, తలను నరికే సన్నివేశం అద్భుతంగా చూపించారు. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫ్రేమ్‌కి ప్రాణం పోసింది. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగం ప్రేక్షకులను గూస్‌బంప్స్‌కి గురిచేస్తుంది. ప్రభాస్(Prabhas) తెరమీద చూపించిన రాజసపు తీరు ఈసారి కూడా మంత్రముగ్ధులను చేస్తుంది.

రాజమౌళి సర్‌ప్రైజ్: ది ఎటర్నల్ వార్

సినిమా చివరలో రాజమౌళి మరో సర్‌ప్రైజ్ అందించారు. “బాహుబలి: ది ఎటర్నల్ వార్” అనే కొత్త 3D యానిమేటెడ్ సినిమాకు టీజర్ చూపించారు. దాదాపు ₹120 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, బాహుబలి విశ్వాన్ని మరో కొత్త కోణంలో చూపించబోతోంది. దర్శకుడు ఇషాన్ శుక్లా దీనికి దర్వకత్వం వహిస్తున్నారు. రాజమౌళి మాట్లాడుతూ, “ఇది బాహుబలి ప్రపంచాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది” అని తెలిపారు.

“బాహుబలి: ది ఎపిక్” సాధారణ రీ-రిలీజ్ కాదు, ఇది ఒక కొత్త అనుభూతి. రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని కలిపి థియేటర్లలో మరోసారి బాహుబలి సత్తా ఏంటో చూపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు