/rtv/media/media_files/2025/04/08/9vCWPVEWedTqBsM8K2fS.jpg)
tahira kashyap khurrana
Tahira kashyap: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా సతీమణి తాహిరా కశ్యప్ కు మరోసారి క్యాన్సర్ తిరగబడింది. అయితే 2018లో తాహిరాకి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. ఆ తర్వాత ఆమె ఆ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ కోసం 'మాస్టెక్టమీ' అనే సర్జరీ కూడా చేయించుకున్నారు. ఓవైపు చికిత్స తీసుకుంటూనే.. దాని గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు అవగాహన కల్పించేది తాహిరా. అలా కొన్నాళ్ల పాటు చికిత్స తర్వాత కోలుకున్నారు.
రెండవసారి క్యాన్సర్
అయితే ఇప్పుడు అంతా బాగానే ఉందనుకునేలోపు.. దురదృష్టవశాత్తు ఆమెకు మళ్ళీ క్యాన్సర్ తిరగబడింది. సోమవారం ఉదయం తాహిరా ఈ వార్తను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ''దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తెలిపింది. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ సానుకూలంగా ముందుకెళ్లాలి'' అని పేర్కొంది. దీంతో అభిమానులు, సెలెబ్రెటీలు తాహిరా కశ్యప్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. సోనాలీ బింద్రే, గునీత్ మోంగా, ట్వింకిల్ ఖన్నా, అపర్శక్తి ఖురానా పలువురు బాలీవుడ్ నటులు ఇన్‌స్టా వేదికగా తాహిరాకి ఎమోషనల్ సపోర్ట్ అందించారు.
ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తారాహి కశ్యప్ మాస్టెక్టమీ సర్జరీ సమయంలో తన అనుభవాలను పంచుకున్నారు. సర్జరీ తర్వాత గుండుతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా .. ఆమె తల్లిదండ్రులు తనతో మాట్లాడలేదని పంచుకుంది. ఆ ఫొటోలు తీసేయమని బలవంతం చేశారు. కానీ, తాను జీవితంలోని ఆ దశను కూడా సెలెబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పినట్లు గుర్తుచేసుకుంది.
latest-news | cinema-news | telugu-news | breast-cancer