Devara : 'దేవర' నుంచి ఆయుధ పూజ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

'దేవర' మూవీలోని 'ఆయుధ పూజ' సాంగ్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సాంగ్ లో ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ తో అదరగొట్టేశారు. తాజాగా దీని ఫుల్ వీడియోని మూవీ టీమ్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే భారీ వ్యూస్ అందుకుంది.

New Update

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'దేవర' ఇటీవల థియేటర్స్ లో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా రుపొంచిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 

కాగా ఈ సినిమాకు అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా రిలీజ్ కు ముందు వదిలిన 'ఆయుధ పూజ' సాంగ్ అయితే సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచింది. సాంగ్ లో ఎన్టీఆర్ డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ అంతా థియేటర్స్ లో పూనకాలతో ఊగిపోయారు. ఈ సాంగ్ కోసమే సినిమాని రెండోసారి చూసిన ఆడియన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 

Also Read : 'RRR' కు మించి ఆ సీన్స్ ఉంటాయి.. 'SSMB29' పై రాజమౌళి బిగ్ అప్డేట్

తాజాగా ఈ సాంగ్ తాలూకు ఫుల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. 'ఆయుధ పూజ' సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చేసింది. రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే భారీ వ్యూస్  అందుకుంది. మీరు కూడా ఫుల్ వీడియో సాంగ్ చూడాలనుకుంటున్నారా? అయితే 'టీ సిరీస్ తెలుగు' యూట్యూబ్ ఛానెల్ లో వెంటనే చూసేయండి. 

త్వరలోనే ఓటీటీలోకి..

'దేవర' నవంబర్ 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంది. అయితే థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే నెట్ ఫ్లిక్స్ తో నిర్మాతలకు ఆరు వారాల ఒప్పందం కుదిరిందట. ఈ లెక్కన నెట్ ఫ్లిక్స్ లో నవంబరు 8 నుంచే 'దేవర' స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా నెట్ ఫ్లిక్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Also Read: వామ్మో! అంత ఖరీదైన రిసార్టులో పూజ బర్త్ డే.. ఒక్కరోజుకు ఎన్ని లక్షలంటే?

#devara #ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe