AR Rehaman:
వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య సైరా భాను స్వయంగా ప్రకటించారు. ఇప్పటికీ ఇద్దరి మధ్యనా గాఢమైన ప్రేమ ఉందని...కానీ ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు. ఎంత ప్రేమ ఉన్నా...ఇద్దరం కలిసి ఉండలేకపోతే..విడిపోవడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నామని సైరా చెప్పారు.
Also Read: AP:అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
ఇది చాలా ఆవేదనతో కూడుకున్న నిర్ణయమని సైరా అన్నారు. తన జీవితంలో అత్యంత కష్టమైన అధ్యాయం ఇది అని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు, ఫ్యాన్స్ తమకు సహకరించాలని సైరా అభ్యర్ధించారు. తాజాగా తమ విడాకుల విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ స్పందించారు.‘మేము సంతోషంగా ముప్పైకి చేరుకోవాలని ఆశించాము. కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయని తెలిగింది. ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడి సింహాసనమైన వణుకుతుంది.
Also Read: TG-TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు
అయినా ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుకుతున్నాము. విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా కనిపించవు’ అంటూ ఎమోషనల్ నోట్ ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. సైరాతో గడిపిన మూడు దశాబ్దాల జీవితాన్ని ముగించడంపై రెహమాన్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితులలో తన స్నేహితులకు, బంధువులు చూపించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపాడు.
Also Read: Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు!
రెహమాన్ తన కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్ గా ఉంచడానికే చూస్తుంటారు. రెహమాన్ అంతర్జాతీయ స్టార్‌డమ్‌కి ఎదుగుతున్న సమయంలో కాల పరీక్షను తట్టుకుని నిలబడేందుకు సైరా బాను అండగా నిలిచింది. వీరిద్దరి వివాహం 1995లో జరిగింది. పెళ్లైన దాదాపు మూప్పై ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడానికి భావోద్వేగపూరితమైన గాయమని సైరా బాను తరపు లాయర్ అన్నారు.
Also Read: AP Rains: ముంచుకొస్తున్న మరో అల్పపీడనం... ఆ రెండు రోజులు వానలే వానలు!
విడాకులపై రెహమాన్ తనయుడు అమీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘అందరికీ మనవి చేస్తున్నా.. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలాని, ఈ పరిస్థితిని మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.
విడాకులపై రెహమాన్ తనయుడు అమీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘అందరికీ మనవి చేస్తున్నా.. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి. మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.