AR Rahman: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై కుమారుడి కీలక ప్రకటన!

ఏఆర్ రెహ్మాన్ అనారోగ్యంపై ఆయన కొడుకు అమీన్ స్పందించారు. ప్రస్తుతం నాన్న హెల్త్ బాగానే ఉందని, డీహైడ్రేషన్ కారణంగా కాస్త బలహీనంగా అనిపించడంతో రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రిలో చేరించనట్లు చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేసినట్లు వివరించారు.

New Update
ar rahman discharged from hospital

ar rahman discharged from hospital

AR Rahman: ఇండియన్ లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ అనారోగ్యానికి గురైనట్లు తెలియడంతో అభిమానులంతా ఆందోళన చెందారు. సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో చెన్నై లోకి  అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు తెలిసింది. అయితే తాజాగా రెహ్మన్ ఆరోగ్యంపై ఆయన కొడుకు అమీన్ స్పందించారు. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం బాగానే ఉందని. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశామని తెలిపారు. డీహైడ్రేషన్ కారణంగా కాస్త బలహీనంగా అనిపించడంతో రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్నతలు అని పేర్కొన్నారు.  తమిళనాడు సీఎం MK. స్టాలిన్ కూడా రెహ్మాన్ ఆరోగ్యంపై చెన్నై అపోలో వైద్యులను సంప్రదించగా..  ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని  చెప్పినట్లు ట్వీట్ చేశారు. దీంతో ఆయన అభిమానులంతా కాస్త ఊపిరిపీల్చుకున్నారు. 

స్టాలిన్ ట్వీట్

 

Also Read: Veera Dheera Soora Teaser: ఉత్కంఠభరితంగా విక్రమ్ 'వీర ధీర శూర' టీజర్.. ఫ్యాన్స్ గెట్​రెడీ..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు