AR Rahman : విడాకుల వెనక షాకింగ్ రీజన్.. రెహమాన్ అలా చేశాడా?

AR రెహమాన్ దంపతుల విడాకుల వెనక షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. రెహమాన్ ఎక్కువ సమయం సినిమా పనులపైనే దృష్టి సారిస్తూ ఫ్యామిలీని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, ఆ గొడవలే వీరి విడాకులకు ప్రధాన కారణం అని తెలుస్తోంది.

New Update
ar (1)

ప్రముఖసంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 1995లో పెళ్లి చేసుకున్న ఈ జంట 29 ఏళ్ళ తర్వాత విడాకులు తీసుకోవడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దీంతో వీరి విడాకుల వెనక కారణాలు ఏమై ఉంటాయా అనే కోణంలో నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే కొన్ని షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. అసలు ఈ విడాకుల ఆలోచన రెహ్మన్ భార్య సైరా భాను దేనని తెలుస్తోంది. రెహమాన్ గత కొన్నాళ్లుగా తన ఫ్యామిలీకి సమయం కేటాయించకుండా ఎక్కుగా టైమ్ సినిమా పనులపైనే దృష్టి పెట్టడం సైరా భానుకు ఏమాత్రం నచ్చకపోవడంతో వీరి మధ్య తరచూ ఈ విషయంపైనే గొడవలు జరిగేవట. ఈ మధ్య కాలంలో రెహమాన్ కు సినిమా అవకాశాలు ఎక్కువయ్యాయి. 

Also Read: అయ్యో పాపం.. ట్రాక్టర్‌లో ఇరుక్కొని రైతు మృతి

ఆ గొడవే కారణమా?

దీంతో ఆయన ఇంట్లో కంటే స్టూడియోలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఇటీవల వెరీ మధ్య పెద్ద గొడవే జరిగిందని,ఆ గొడవే వీరి విడాకులకు ప్రధాన కారణంగా మారిందని అంటున్నారు. గొడవ అనంతరం ఇద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. దీనిపై ముందుగా కూతుళ్లు, కొడుకులతో సంప్రదింపులు జరిపి ఆ తర్వాత విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు మీడియా వర్గాల్లో కథనాలు వస్తున్నాయి. 

Also Read: తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!

పెళ్ళికి ముందే భార్య గురించి అలా..

రెహమాన్ 2012 లోనే ఓ ఇంటర్వ్యూలో కాబోయే భార్య గురించి మాట్లాడుతూ..' రంగీలా, బాంబే లాంటి చిత్రాలు చేస్తున్న స‌మ‌యంలో చాలా బిజీగా ఉన్నానని, ఆ స‌మ‌యంలో పెళ్లి చేసుకోవాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిందని అప్పుడు నా వ‌యసు 29 ఏళ్లు అని, పెళ్లి కూతుర్ని వెతికి పెట్టండి అని త‌న త‌ల్లికి అప్పుడే చెప్పిన‌ట్లు రెహ్మాన్ ఆ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు.

అంతేకాకుండా నా భార్య చాలా సింపుల్‌గా ఉండాల‌ని భావించాన‌ని, త‌న కెరీర్‌కు ట్ర‌బుల్ రావొద్ద‌ని ఆశించాన‌ని, దాని వ‌ల్ల త‌న మ్యూజిక్‌పై దృష్టి పెట్ట‌వ‌చ్చు అనుకున్నాన‌న్నాడు. ఓ సూఫీ క్షేత్రం వ‌ద్ద సైరా సోద‌రి త‌న త‌ల్లికి ప‌రిచ‌యం అయ్యింద‌ని, ఆ త‌ర్వాత సైరాతో బంధం ఏర్ప‌డింద‌ని అన్నారు.

Also Read: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు