BIG BREAKING: డైరెక్టర్ RGV అరెస్ట్! ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. HYD లోని ఆయన నివాసానికి ఏపీ పోలీసులు చేరుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ చేసినందుకు RGVపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. By V.J Reddy 13 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి RGV: డైరెక్టర్ ఆర్జీవి అరెస్ట్ కు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి ఏపీ పోలీసులు చేరుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ చేసినందుకు RGVపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కట్ చేస్తే... ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రాంగోపాల్ వర్మపై కేసు ఫైల్ అయింది. ‘వ్యూహం’ సినిమా సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు PSలో ఐటీ చట్టం కింద RGV పై కేసు నమోదు చేశారు. కాగా చంద్రబాబు, పవన్, లోకేశ్ పై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను ఇప్పటికే అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా విషయం ఏంటంటే.. ఆర్జీవి తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్‌కి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో చంద్రబాబు ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. అప్పట్లో ట్రైలర్ రిలీజ్ చేయడంతో అందరికీ పూర్తిగా అర్థం అయిపోయింది. Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా? నిన్న పోసానిపై కూడా... తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే పోసాని కృష్ణ మురళి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు ఈసారి షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై.. ఆయన కుటుంబంపై పోసాని కృష్ణమురళి అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని.. పోసానిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారు ఆ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోసాని ఇష్టానుసారంగా.. అనేక సార్లు పవన్ కళ్యాణ్ తో సహా ఆయన కుటుంబ సభ్యులను, జనసేన కార్యకర్తలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషణలు చేశారని.. అయితే పోసానిపై ఫిర్యాదు చేసినా.. వైసీపీ ప్రభుత్వ అండతో పోలీసులు పట్టించుకోలేదని ఎస్పీకి చెప్పారు. Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్! #ramuism #vyuham-movie #lokesh #chandrababu #RGV Arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి