Breaking: చిరంజీవి సినిమాకు ఏపీ ప్రభుత్వ అనుమతి

చిరంజీవి నటించిన మన శంకర్ వర ప్రసాద్ సినిమాకు ప్రత్యేక షోకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ఒక ప్రత్యేక షో వేసుకోవచ్చిన చెప్పింది. టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది.

New Update
Mana Shankara Vara Prasad Garu

Mana Shankara Vara Prasad Garu

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వర ప్రసాద్ మూవీకి ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ పచ్చ జెండా ఊపింది. ఈ సినిమా ప్రత్యేక షోకు అనుమతినిచ్చింది. జనవరి 11న రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ఒక ప్రత్యేక షో వేసుకోవచ్చని చెప్పింది. ప్రత్యేక షో టికెట్ ధర జీఎస్టీ కలిపి రూ.500 ఉండే విధంగా చూసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రోజుకు గరిష్టంగా 5 షోలు మాత్రమే వేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సినిమా డిస్టిబ్యూటర్లకు తెలిపింది.  దీంతో పాటూ జనవరి 12 నుంచి 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపుకు కూడా అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.100 ,  మల్టీప్లెక్స్‌లలో రూ.125 పెంచుకునేలా వీలు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ అంతటా అన్ని థియేటర్లకు ఈ అనుమతులు వర్తిస్తాయని తెలిపింది. 

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ సినిమా అంటే పండుగ వాతావరణం రావడం సహజం. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతోంది.

ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక సినిమాలు తీయడంలో ఆయనకు మంచి పేరు ఉంది. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్, చిరంజీవి సంక్రాంతి సెంటిమెంట్ ఈ సినిమాకు బలంగా మారాయి. ఈసారి పోటీ సినిమాలు ఎక్కువగా ఉన్నా, ‘మన శంకర వర ప్రసాద్ గారు’కి ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే, నార్త్ అమెరికాలో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడ ఈ సినిమా మంచి జోరు చూపిస్తోంది. ఇతర భారీ పాన్ ఇండియా సినిమాలతో పోల్చినా భారీ స్థాయిలో బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, అమెరికాలో ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సినిమా 120 వేల డాలర్ల మార్క్‌ను దాదాపు చేరుకుంది. ఇండియన్ కరెన్సీలో ఇది రూ.1 కోటికి పైగా గ్రాస్ కావడం విశేషం.

Advertisment
తాజా కథనాలు