ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ సినిమాల టికెట్ రేట్లు పెంచడం, బెనిఫిట్ షోలని ఏవీ ఉండేవి కావు. కానీ ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సినిమా వాళ్లకు బాగా ప్లస్ అయింది. ఇప్పుడున్న ఏపీ గవర్నమెంట్ సినిమా వాళ్లకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తోంది.
సినిమాలకు టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు కూడా ఇస్తోంది. తాజాగా సంక్రాంతి సినిమాలన్నిటికీ టికెట్ రేట్ల పెంపుకు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు విడుదలవుతున్నాయి.
Also Read : కింగ్ ఆఫ్ జంగిల్.. 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది
వీటిలో 'గేమ్ ఛేంజర్' టికెట్ రేట్స్, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత మిగతా రెండు సినిమాలకు కూడా అదే వెసలుబాటు కల్పించింది. ఇంతకీ టికెట్ రేట్లు ఏ సినిమాకి ఎంత పెంచారు? అనే వివరాల్లోకి వెళ్తే..
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు జనవరి 10వ తేదీన ఉదయం 1 గంటకు బెనిఫిట్ షో, ఆ రోజు ఆరు షోలకు, ఆ తర్వాత నుంచి రెండు వారాల వరకు రోజుకు అయిదు షోలకు అనుమతులిచ్చారు. ఇక బెనిఫిట్ షో టికెట్ ధర గేమ్ ఛేంజర్ కు 600 రూపాయలుగా విక్రయించుకునేందుకు, జనవరి 10వ తేదీ నుంచి 23 తేదీ వరకు మల్టిప్లెక్స్ లలో 175 రూపాయలు, సింగిల్ థియేటర్లలో 135 రూపాయలు టికెట్ రేటు పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు.
AP Government Order For Game Changer Ticket Hikess!!#GameChanager #PawanKalyan pic.twitter.com/5NwqsSBojW
— Badri Kalyan (@BADRI__PSPK) January 4, 2025
బాలయ్య 'డాకు మహారాజ్' సినిమాకు ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షోకు, మొదటి రోజు నుంచి రెండు వారాల వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చారు. బెనిఫిట్ షోకు టికెట్ ధర 500 రూపాయలు పెట్టుకునేలా, రెండు వారాల పాటు మల్టీప్లెక్సుల్లో 135 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.
Also Read : టికెట్ రేట్లు పెంచుతుంది అందుకే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్
#DaakuMaharaaj AP Ticket hikes GO.
— Matters Of Movies (@MattersOfMovies) January 4, 2025
Shows from 4 am. #NandamuriBalakrishna pic.twitter.com/uEqCpKfoIp
వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు రిలీజ్ రోజు నుంచి రెండు వారాల పాటు రోజుకు అయిదు షోలకు అనుమతులు ఇచ్చారు. అలాగే మల్టీప్లెక్సుల్లో 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు టికెట్ రేటు పెంచుకునేలా వీలు కల్పించారు.
#SankranthikiVasthunam - AP - Ticket Hikes pic.twitter.com/udpVj0hJqZ
— Aakashavaani (@TheAakashavaani) January 4, 2025