Anil Ravipudi: ఈసారి సంక్రాంతికి 'మెగాస్టార్‌'తో వస్తున్నాం: అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి 2026 సంక్రాంతికి చిరంజీవితో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కథను సిద్ధం చేస్తున్నారు. ఆదివారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నా ఆయిన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు తెలుపుతామన్నారు.

New Update
Anil Ravipudi

Anil Ravipudi

Anil Ravipudi: 2025 సంక్రాంతికి విక్టరీ వెంకటేష్(Venkatesh) తో అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ పండగకి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మరోసారి 2026 సంక్రాంతి ని టార్గెట్ చేస్తూ ఈసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం అని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. ఆదివారం, ఆయన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని, తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్‌ను స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. 

చిరంజీవితో మరో బ్లాక్ బస్టర్

ఈ సందర్భంగా, అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ, "ఈ ఏడాది  వెంకటేశ్ గారితో కలిసి చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా అద్భుత విజయాన్ని సాధించడం నాకు ఎంతో ఆనందం ఇచ్చింది. అలాగే వచ్చే సంక్రాంతికి చిరంజీవిగారితో మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కథను సిద్ధం చేస్తున్నానన్నారు. ప్రతీ సినిమాకి తాను స్క్రిప్ట్ వైజాగ్ వచ్చి రాసుకుంటానని,  వైజాగ్ తనకి ఎంతో సెంటిమెంట్ అని చెప్పుకొచ్చారు. 

Also Read:Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!

అయితే, చిరంజీవితో తీసే మూవీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ‘గ్యాంగ్‌లీడర్’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’ లో కనిపించిన చిరంజీవిని మళ్ళీ చూస్తారు. మే చివరలో లేదా జూన్ లో షూటింగ్ స్టార్ట్ అవుతోంది" అని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ మూవీకి మ్యూజిక్ భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.

Also Read:Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

Advertisment
తాజా కథనాలు