Anchor Pradeep: ఆ అమ్మాయితో ప్రదీప్ హొలీ సెలెబ్రేషన్స్.. వీడియో వైరల్!

యాంకర్ ప్రదీప్ తన నెక్స్ట్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ దీపికా పిల్లితో కలిసి హొలీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బెస్ట్ జోడీ అని కామెంట్లు చేస్తున్నారు.

New Update
anchor pradeep holi

anchor pradeep holi

Anchor Pradeep:  యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఓ వైపు షోలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు హీరోగా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే రొమాంటిక్ డ్రామాతో హీరోగా తెరంగేట్రం చేసిన ప్రదీప్.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. నితిన్ భరత్ దర్శకత్వంలో  'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా చేస్తున్నాడు. ఇందులో జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తోంది. 

Also Read:Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!

హీరోయిన్ తో హొలీ 

అయితే నిన్న హొలీ సందర్భంగా.. మూవీని ప్రమోట్ చేస్తూ ప్రదీప్ హీరోయిన్  దీపికతో హొలీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ  కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ''రంగుల వినోదం లోడ్ అవుతోంది.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టీమ్ నుంచి హోలీ శుభాకాంక్షలు'' అని తెలిపారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు బెస్ట్ జోడీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మాంక్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, G M సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ , తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్  'లే లే.. లేలే' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

Advertisment
తాజా కథనాలు