/rtv/media/media_files/2025/04/17/xj2686kJ1d8yCKKKd3bc.jpg)
Shivangi
Shivangi: ఉమెన్ సెంట్రిక్ పాత్రలతో కథ నడిచే థ్రిల్లర్ సినిమా "శివంగి", ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, నెలన్నర తర్వాత ఆహా (AHA) డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఏప్రిల్ 17 నుంచి తెలుగు వెర్షన్, ఏప్రిల్ 18 నుంచి తమిళ వెర్షన్ స్ట్రీమ్ అవుతోంది.
Also Read: బాలయ్య బర్త్ డేకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఫ్యాన్స్ కి పండగే..!
తారాగణం..
ఈ చిత్రంలో ఆనంది(Anandhi).. సత్యభామ అనే గృహిణిగా అద్భుత నటన కనబరిచింది. మరోవైపు వరలక్ష్మీ శరత్‌కుమార్(Varalakshmi Sarathkumar) పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపించగా, ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది దేవరాజ్ భరణీధరన్. నిర్మాణ బాధ్యతలు నరేశ్ బాబు.పి తీసుకున్నారు.
Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్ - నీల్ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్
కథలోకి వెళ్లితే..
సత్యభామ (ఆనంది) ఒక సాధారణ గృహిణి. భర్త అనారోగ్యం, కుటుంబ ఆర్థిక భారం, అత్తచెల్లి వేధింపులు ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంటాయి. ఇలాంటి కష్టకాలంలో ఓ రోజు ఆమె తల్లిదండ్రులు వరదలో చిక్కుకుని కనిపించకుండా పోతారు. వారిని వెతకడం కోసం ఆమె పోలీసులను సంప్రదిస్తుంది. అక్కడ నుంచి కథకు ఊహించని మలుపులు తిరుగుతుంది.
Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..
ఈ నేపథ్యంలో అసలు నిజంగా ఎవరైనా మృతిచెందారా? ఇవన్నీ యాక్సిడెంట్ లా? లేదా కుట్ర? పోలీస్ విచారణలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి? సత్యభామ తాను ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఎలా బయటపడింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఆహాలో "శివంగి" సినిమాను తప్పక చూడాల్సిందే.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..