/rtv/media/media_files/2025/07/20/filmmaker-chandra-barot-passed-away-2025-07-20-13-56-43.jpg)
filmmaker Chandra Barot passed away
అమితాబ్ బచ్చన్ (amitab-bacchan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'డాన్' డైరెక్టర్ చంద్ర బరోట్ (director Chandra Barot) 86 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా వెల్లడించారు. ఆయన మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ తారలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read : ఆసక్తిరకర ఘటన.. పెట్రోలింగ్ చేస్తున్న ఏడుగురు పోలీసుల అదృశ్యం
Saddened to hear about the demise of veteran filmmaker #ChandraBarot ji, the director of the iconic original #Don [1978]… Heartfelt condolences to his family and loved ones... #OmShanti 🙏🙏🙏 pic.twitter.com/uaWGEwpDEP
— taran adarsh (@taran_adarsh) July 20, 2025
Also Read : మహేష్ బాబును ఫిదా చేసిన హిందీ సినిమా .. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్
'డాన్' తో సినిమాతో రికార్డ్
అమితాబ్ బచ్చన్ హీరోగా చంద్ర బరోట్ దర్శకత్వం వహించిన 'డాన్' సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా.. అమితాబ్ కెరీర్ ఒక మైలురాయిగా నిలిచింది. సలీమ్ జావేద్ ఈ సినిమాకు కథను అందించారు.
Chandra ji RIP sir. The only director I assisted. Not in Don. For a film with Vinod Khanna called Boss that never saw the light of day. But what am enriching experience working with him. Heard so many BTS stories of Don. I sided bunk college and assist Chandraji. Remarkably sharp… pic.twitter.com/POaXkNEFbU
— kunal kohli (@kunalkohli) July 20, 2025
Also Read : ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్
ఆ తర్వాత ప్యార్ భార దిల్, హాంకాంగ్ వాలీ స్క్రిప్ట్, నీల్ కో పకడ్నా పలు సినిమాలు తెరకెక్కించారు. కానీ, ఆయనకు అత్యంత గుర్తింపు తెచ్చింది మాత్రం డాన్. డైరెక్టర్ గా మాత్రమే కాదు పురబ్ ఔర్ పచ్చిమ్, యాద్గార్, రోటీ కపడా ఔర్ మకాన్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు బరోట్.