Amitabh Bachchan: అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కొంతమంది అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడగా.. మరికొంతమంది బన్నీ కారణంగానే ఓ నిండు ప్రాణం పోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోలో అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం! అల్లు అర్జున్ కి వీరాభిమానిని తాజాగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఓ మహిళ.. తనకు అల్లు అర్జున్, అమితాబ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. దీనిపై అమితాబ్ స్పందిస్తూ.. అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపులనింటికీ పూర్తి అర్హుడని.. తాను కూడా బన్నీకి వీరాభిమానినని అన్నారు. అలాగే ఇటీవలే విడుదలైన పుష్ప2 మంచి విజయం సాధించిందని.. మీరు ఇంకా సినిమాను చూడకపోతే వెంటనే చూడండి అని ఆమెతో చెప్పారు. బన్నీ గొప్ప ప్రతిభావంతుడు..అతడితో నన్ను పోల్చవద్దు అని సరదాగా మాట్లాడారు. 💫 #AmitabhBachchan Calls Himself the biggest fan of #AlluArjun Acting in #Kbc & Fully praised Him - He Argued everyone Watch #Pushpa2#Pushpa2TheRule #KaunBanegaCrorepati #HappyBirthdaySalmanKhan pic.twitter.com/lL5R1n5ErD — MJ Cartels (@Mjcartels) December 27, 2024 ఇది ఇలా ఉంటే .. గతంలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో బన్నీ ఈరోజు బెయిల్ పిటీషన్ విచారణకై నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. విచారణను మళ్ళీ సోమవారానికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరగా.. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. కాగా ఇవాళ జరిగిన విచారణకు అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరయ్యారు. ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?