/rtv/media/media_files/2025/01/29/UW4aE29IE9O8UPb6dOLt.jpg)
allu arjun sandhya theatre stampede sritej health bulletin Released
అల్లు అర్జున్ ‘పుష్ప2’ మూవీ ప్రీమియర్ సమయంలో హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ బాలుడుకి సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
Also Read: ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..AI సహాయంతో పంపిణీ!
శ్రీతేజ్ హెల్త్ బులిటెన్
ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. ఇప్పుడిప్పుడే మెలుకువగా ఉంటున్నాడని అన్నారు. అయితే తమ కుటుంబ సభ్యులను మాత్రం గుర్తించలేకపోతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. అది మాత్రమే కాకుండా ఎవరైనా పిలిచినా, పలకరించినా.. ప్రతిస్పందన లేదని షాకింగ్ విషయాలు చెప్పారు. కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.
Also Read: హైదరాబాద్‌లో రేపు చికెన్, మటన్ షాపులు బంద్.. ఎందుకో తెలుసా?
ఏం జరిగింది
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందు డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటరలో ప్రీమియర్ షో చూసేందుకు మృతురాలు రేవతి, ఆమె భర్త, కుమారుడు శ్రీతేజ్ వెళ్లారు.
Also Read: మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. యోగీ సర్కార్ సంచలన ప్రకటన
అదే సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వస్తున్నాడని తెలిసి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అదే సమయంలో తొక్కిసలాట జరిగి రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ బాలుడి ట్రీట్మెంట్ కోసం ఇండస్ట్రీ నుండి రూ.2 కోట్ల నష్ట పరిహారాన్ని అందించిన విషయం తెలిసిందే.