అల్లు అర్జున్‌కు ఆ తేదీ నుంచి తిరుగుండదు.. వేణు స్వామి సంచలన జ్యోతిష్యం!

అల్లు అర్జున్ ను మార్చి 29 నుంచి తిరుగు ఉండదని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తెలిపారు. ఈ రోజు శ్రీతేజ్ ను పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అల్లు అర్జున్ జాతకంలో శని ఉందన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ సమస్యలు ఎదుర్కోవాల్సిందేనన్నారు.

New Update

అల్లు అర్జున్ జాతక రిత్యా ఇప్పుడు శని ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు జానీ మాస్టర్ తో కలిసి సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. కలి యుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో సమస్యలు అక్కడ ఉంటాయన్నారు. ప్రతీ ఒక్కరూ సమస్యలు ఎదుర్కోవాల్సిందేనన్నారు. మార్చి 29 నుంచి అల్లు అర్జున్ జాతకం బాగుటుందన్నారు. ప్రతీ జీవితంలో తప్పొప్పులు, సమస్యలు మనం మారడానికి, ఇంకో పది మెట్లు ఎక్కడానికి అవకాశాన్ని ఇస్తాయన్నారు. 
ఇది కూడా చదవండి: Year Ender 2024 : ఈ ఏడాది చనిపోయిన సౌత్ సినీ సెలెబ్రిటీలు వీళ్ళే..!

వేణు స్వామితో పాటూ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సైతం కిమ్స్ ఆసుపత్రికి వచ్చి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..' శ్రీతేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అతన్ని చూడగానే ఆనందం వేసింది. అతను త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీకి మేము అంటే మా కొరియోగ్రాఫర్ యూనియన్ ఎప్పుడూ అండగా ఉంటుంది..' అని పేర్కొన్నారు. 
ఇది కూడా చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ కు ప్రముఖ హీరోయిన్ సపోర్ట్, రేవంత్ పై ఫైర్

శ్రీతేజ్ కు అల్లు అరవింద్ పరామర్శ..

అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సైతం ఈ రోజు శ్రీతేజ్ ను పరామర్శించారు. అల్లు అర్జున్ తరఫున రూ.కోటి, డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రీ మూవీస్ నుంచి మరో రూ.50 లక్షలు బాధిత కుటంబానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. చెక్కులను తెలంగాణ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజుకు అందజేశారు. మరో వైపు రేపు తెలంగాణ సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. దిల్ రాజు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు