'పుష్ప2' లో కేశవ కళ్ళు పీకేసింది ఎవరు?.. ట్రైలర్ లో ఇది గమనించారా?

'పుష్ప2' ట్రైలర్ ఎండింగ్ లో మీరు సరిగ్గా గమనిస్తే.. పుష్పరాజ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన కేశవకు కళ్ళు ఉండవు.. ట్రైలర్ చివర్లో 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ చెబుతున్న సమయంలో పుష్ప పక్కనే కేశవ ఉంటాడు. ఆ సమయంలో అతనికి కళ్ళు ఉండవు.

New Update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప2' మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్స్ సందడి చేయనుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటూ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. 

అయితే ఈ ట్రైలర్ లో పార్ట్-2 ఎలా ఉండబోతుంది? ఇందులో పుష్ప రాజ్ ఇంటర్నేషనల్ రేంజ్ కు ఎలా ఎదిగాడు? ఆ క్రమంలో భన్వర్ సింగ్ షెకావత్.. 'పుష్ప' ను పట్టుకోవడానికి వేసే ప్లాన్స్? లాంటి అంశాలు ప్రధానంగా పార్ట్-2 లో ఉండబోతున్నాయి. 

Also Read : ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డ్స్..మెగా హీరో షార్ట్ ఫిలింకి అరుదైన పురస్కారం

అయితే ట్రైలర్ ఎండింగ్ లో మీరు సరిగ్గా గమనిస్తే.. పుష్పరాజ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన కేశవకు కళ్ళు ఉండవు.. ట్రైలర్ చివర్లో 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ చెబుతున్న సమయంలో పుష్ప పక్కనే కేశవ ఉంటాడు. ఆ సమయంలో అతనికి కళ్ళు ఉండవు, గుడ్డివాడిగా కనిపిస్తాడు. ఇంతకీ అతనికి కళ్ళు లేకుండా చేసింది ఎవరంటే భన్వర్ సింగ్ షెకావత్..

'పుష్ప 2' షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు 'వేర్ ఈజ్ పుష్ప' అనే వీడియో ఒకటి రిలీజ్ చేశారు. దాని ప్రకారం పార్ట్-2 లో భన్వర్ సింగ్ కుదొరక్కుండా పుష్ప అడవిలో దాక్కుంటాడు. ఆటైంలో భన్వర్ సింగ్ పుష్ప ఫ్రెండ్ అయిన కేశవను పట్టుకొని పుష్ప ఎక్కడ ఉన్నాడని అతన్ని టార్చర్ చేస్తాడు. ఆ క్రమంలో అతనికి కళ్ళు పోతాయి. ఇదే నిజమైతే పుష్ప రివేంజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటం గ్యారెంటీ. సోషల్ మీడియాలో ఇప్పుడు దీని గురించే డిస్కషన్ నడుస్తోంది. 

Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

Advertisment
Advertisment
తాజా కథనాలు