ఏపీలో ‘పుష్ప2’ టికెట్‌ ధరల పెంపు.. అక్కడ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

ఏపీ ప్రభుత్వం 'పుష్ప2' టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారిక జీవో విడుదల చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను రూ.800గా నిర్ణయించారు. 

ap pushpa
New Update

తెలంగాణలోనే కాదు ఏపీలోనూ 'పుష్ప2' టికెట్ రేట్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'పుష్ప2' టికెట్ రేట్ల  పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారిక జీవో విడుదల చేసింది. దాని ప్రకారం.. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను రూ.800గా నిర్ణయించారు (జీఎస్టీ అదనం). 

ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే రూ.800+GST చెల్లించాలి. అయితే తెలంగాణ టికెట్ రేట్లతో పోల్చుకుంటే ఏపీలో చాలా బెటర్ అనే చెప్పాలి. ఏపీలో రిలీజ్ రోజు ఆరు షోలకు అనుమతి ఇచ్చారు. అలాగే సింగిల్ స్క్రీన్‌లలో లోయర్‌ క్లాస్‌ రూ.100 (జీఎస్టీతో కలిపి), అప్పర్‌ క్లాస్‌ రూ.150 (జీఎస్టీతో కలిపి), మల్టీఫ్లెక్స్‌లో రూ.200 (జీఎస్టీతో కలిపి) పెంచారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి 17 వరకు ఐదు షోలకు అనుమతి ఇచ్చారు.

Also Read : 'పుష్ప2' లో ఆ సీన్ చూసి మైండ్ దొబ్బింది.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్

పవన్ కి బన్నీ స్పెషల్ థ్యాంక్స్..

'పుష్ప2' టికెట్ రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి టికెట్‌ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లకు హీరో అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు..' టిక్కెట్ పెంపును ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల మరియు శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుంది. సినిమా పరిశ్రమకు తన వంతు మద్దతు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నా స్పెషల్ థ్యాంక్స్.. అని పేర్కొన్నారు.

Also Read: హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్‌.. పదోతరగతి ఉంటే చాలు!

#allu-arjun #pushpa2
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe