Pushpa2: 'పుష్ప2' అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్.. ఒక్క టికెట్ కాస్ట్ ఎంతంటే?

'పుష్ప2' తెలంగాణ‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌ను సాయంత్రం 4:56 గంట‌లకు ప్రారంభించారు. ప్ర‌స్తుతం,పేటియం, బుక్ మై షోల‌తో పాటు, జోమాటోకి చెందిన డిస్ట్రీక్ట్ యాప్‌లో పుష్ప అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. రికార్డు స్థాయిలో టికెట్స్ సేల్ అవుతున్నాయి.

New Update
bookings

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా ఎప్పుడెప్పుడు బుక్ చేద్దామా అని తెగ వెయిట్ చేస్తున్నారు.

 ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వ‌గా.. రికార్డు స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి. తాజాగా ఇండియాలో కూడా ఈ సినిమా బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఉద‌య‌మే నార్త్ బెల్ట్‌లో బుకింగ్స్ స్టార్ట్ అవ్వ‌గా.. తెలంగాణ‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌ను సాయంత్రం 4:56 గంట‌లకు ప్రారంభించారు. ప్ర‌స్తుతం,పేటియం, బుక్ మై షోల‌తో పాటు, జోమాటోకి చెందిన డిస్ట్రీక్ట్ యాప్‌లో పుష్ప అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి.

Also Read : టీమిండియా క్రికెటర్ పై కన్నేసిన'బాలయ్య' హీరోయిన్..డేటింగ్ కి రెడీ అంటూ

టికెట్ రేట్లు ఇలా..

తెలంగాణ ప్రభుత్వం 'పుష్ప2' టికెట్ ధరల పెంపుతో పాటూ డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోల టికెట్ ధర రూ.800 ఖరారు చేసింది.  డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.

 Also Read : మూడు వారాలకే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు