Arha: అర్హ అంటే డాడీస్ డాటర్ అనుకుంటివా.. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో ఇటీవల పంచుకున్నారు. దీనికి అల్లు అర్హ అంటే డాడీస్ డాటర్ అనుకుంటివా.. డాడీస్ ప్రిన్సెస్ అని పుష్ప డైలాగ్‌లో క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. By Kusuma 20 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురు అర్హ గురించి సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. తన ముద్దుల కూతురు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ పుష్ప డైలాగ్‌లో క్యాప్షన్ ఇచ్చాడు. అల్లు అర్హ అంటే డాడీస్ డాటర్ అనుకుంటివా.. డాడీస్ ప్రిన్సెస్ అని క్యాప్షన్ ఇస్తూ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్! ఆగకుండా తెలుగు పద్యం.. ఇటీవల బాలయ్య బాబు అన్‌స్టాపబుల్‌కి అల్లు అర్జున్‌తో పాటు అర్హ, అయాన్ కూడా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఇటీవల విడుదల చేశారు. ఆ ప్రోమోలో అర్హ తెలుగు పద్యాన్ని ఆపకుండా చాలా క్లియర్‌గా చెప్పింది. దీంతో అర్హ క్యూట్ మాత్రమే కాదు.. వెరీ టాలెంటెడ్ అని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇది కూడా చూడండి: తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..! View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) ఇది కూడా చూడండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన పుష్ప సినిమా రెండో పార్ట్ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల పుష్ప-2 ట్రైలర్ విడుదలైంది. పాట్నా వేదికగా విడుదల చేసిన ఈ ట్రైలర్ కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది. పుష్ప-2 ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. కేవలం 24 గంటల్లో 37.68 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు! #allu-arha #tollywood #Allu Arjun latest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి