అల్లు అర్జున్ కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. ఫ్యాన్స్ అంతా ఒక్కటే

మైత్రీ మూవీస్ నిర్మాతలు 'పుష్ప 2' కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మెగా, అల్లు ఫ్యాన్స్ విబేధాలపై క్లారిటీ ఇచ్చారు. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే. అల్లు అర్జున్ కు ఏ పార్టీతో సంబంధం లేదు. ఫ్యాన్స్ కు, హీరోలకు రాజకీయాలతో ముడిపెట్టొద్దని అన్నారు.

New Update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' మూవీకి సంబంధించి నిర్మాతలు నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో డిసెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. అంతేకాకుండా సినిమా గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 

ఇందులో భాగంగానే ఓ విలేకరి.. ఎలక్షన్ టైం లో అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడంతో అల్లు - మెగా ఫ్యాన్స్ మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. మరి 'పుష్ప 2' ను మెగా ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుంటారని అడిగారు. దీంతో నిర్మాతలు నవీన్, రవి శంకర్ మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కరే. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ 'పుష్ప 2' సినిమా చూడాలి అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఏదైనా చిన్న చిన్నవి వచ్చి ఉండొచ్చు.

Also Read : 'పుష్ప 2' రిలీజ్ డేట్ మారిందోచ్.. బన్నీ కొత్త లుక్ మాములుగా లేదుగా

అందరూ ఒకటే..

అంతేకాని సినిమా పరంగా అందరూ ఒకటే. ఆయన పొలిటికల్ గా డివైడ్ అవ్వలేదు. అసలు అల్లు అర్జున్ కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఫ్యాన్స్ కు, హీరోలకు రాజకీయాలతో ముడిపెట్టొద్దు అని అన్నారు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. 

ఇక 'పుష్ప 2' విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటించగా.. ఫహద్ ఫాసిల్, ధనంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  

Also Read : ఆ సినిమా ఇప్పుడొచ్చుంటే పాన్ ఇండియా హిట్ అయ్యేది.. రామ్ చరణ్ మూవీపై దుల్కర్

#allu-arjun #pushpa-2
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe