#AA22xA6: పుష్ప2 తర్వాత అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రాబోతున్న #AA22xA6 సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన మరో అప్డేట్ ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
Also Read: Samantha: అఖిల్ పెళ్లి వేళ.. నాగచైతన్యకు సమంత షాక్!
అల్లు అర్జున్ జోడీగా దీపికా
ఇందులో అల్లు అర్జున్ (Allu Arjun) జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఖ్వీన్ దీపికా పదుకొనే(Deepika Padukone) నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు దీపికా ఇంట్రడక్షన్ వీడియోను షేర్ చేశారు. ఇందులో దీపికా సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్, స్టెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. దీంతో ఈ సినిమాలో దీపికా రోల్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉండబోతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దీపికతో పాటు జాన్వీ, మృణాల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని టాక్. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఇందులో బన్నీ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారట. దీంతో ముగ్గురు హీరోయిన్లు బన్నీ జోడీగా మెరవనున్నట్లు సమాచారం. ఏదేమైనా అల్లు అర్జున్, దీపికా, అట్లీ లాంటి పవర్ ఫుల్ కాంబో కలిసి రావడం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
The Queen marches to conquer!❤🔥
— Sun Pictures (@sunpictures) June 7, 2025
Welcome onboard @deepikapadukone✨#TheFacesOfAA22xA6
▶️ https://t.co/LefIldi0M5#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥@alluarjun @Atlee_dir#SunPictures #AA22 #A6 pic.twitter.com/85l7K31J8z
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ చిత్ర షూటింగ్ 2025 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో ప్రారంభం కానుంది. అత్యంత భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
డైరెక్టర్ అట్లీ ఇటీవలే ముంబై బాంద్రాలోని మోహబూబా స్థూడియోస్ లో అల్లు అర్జున్ లుక్ టెస్ట్ నిర్వహించారు. బన్నీ పాత్ర కోసం అట్లీ డిఫరెంట్ లుక్స్ ట్రై చేసినట్లు సమాచారం . ఇందులో బన్నీని ఓ భిన్నమైన ఇమేజ్ తో పరిచయం చేయాలని అనుకుంటున్నారట అట్లీ.