/rtv/media/media_files/2025/06/07/LNOi8EI3F4LdMVUOBpCg.jpg)
Samantha tattoo
Samantha: టాలీవుడ్ నటి సమంత తన మాజీ భర్త నాగచైతన్య(samantha naga chaitanya)కు సంబంధించిన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నారు. అయితే విడాకుల తర్వాత కూడా ఆమె వీపు భాగంలో చైకి సంబంధించి YMC (యే మాయ చేశావే) టాటూ(Samantha tattoo) ఉండగా.. ఇప్పుడు దానిని పూర్తిగా తొలగించినట్లు తెలుస్తోంది. ఇటీవలే సామ్ ఓ యాడ్ షూట్ లో పాల్గొనగా.. ఆ ఫొటోల్లో టాటూ కనిపించలేదు. దీంతో ఈ చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే సామ్ ఒంటిపై చైతూకి సంబంధించిన రెండు మూడు టాటూలు ఇప్పటికీ ఉన్నాయి. చై - సామ్ 2021లో విడాకులు తీసుకున్నారు. టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరుతెచ్చుకున్న ఈ జంట పెళ్ళైన నాలుగేళ్లకు విడాకులకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: ది అమెరికా పార్టీ.. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు ఇదే..
సినిమాలతో బిజీ
ప్రస్తుతం చై- సామ్ ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు. విడాకుల తర్వాత ఇటీవలే అనారోగ్య సమస్యల నుంచి కాస్త కోలుకున్న సామ్.. మళ్ళీ సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఇటీవలే సామ్ నిర్మించిన 'శుభం' సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. దీని తర్వాత సామ్ మరో ప్రాజెక్టులతో సిద్ధంగా ఉంది. రక్త బ్రహ్మాండ్, మా ఇంటి బంగారం సినిమాలు చేస్తుంది.
Also Read: వాట్సాప్ కు పోటీగా ఎక్స్ చాట్..మస్క్ మరో ప్లాన్
శోభితతో పెళ్లి
ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. సామ్ తో విడాకుల తర్వాత చై శోభితను పెళ్లాడారు. 2024లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. అక్కినేని నాగేశ్వర్ రావు అశీసులతో అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహ వేడుకలు నిర్వహించారు.
Also Read: Akhil Akkineni Wedding: అఖిల్ సంగీత్ లో నాగచైతన్య, నాగార్జున రచ్చ రచ్చ! వీడియో వైరల్