Arya 2 Trailer: ‘ఆర్య2’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?.. అదిరిపోయింది మావా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య2’ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో మరోసారి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

New Update
arya 2 trailer

ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల చిత్రాలను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేసి సందడి చేస్తున్నారు. తొలిసారి థియేటర్లలో ఫ్లాప్‌గా నిలిచిన చిత్రాలు సైతం రీ రిలీజ్‌లో దుమ్ము దులిపేస్తున్నాయి. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ ఇలా ప్రతి ఒక్కరి సినిమాలను థియేటర్లలో మరోసారి రిలీజ్ చేశారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

ఇటీవలే ప్రభాస్ ‘సలార్’ మూవీని రీ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. అదే ‘ఆర్య2’. ఇందులో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రలో పోషించారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో మంచి హిట్ టాక్ అందుకుంది.  ఇందులోని ‘ఉప్పెనంత ఈ ప్రేమకి.. గుప్పెడంత గుండె ఏమిటో’ అంటూ సాగే ఈ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

ట్రైలర్ రిలీజ్

మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. ఇందులోని మరో సాంగ్ అప్పట్లో ఫుల్ ట్రెండ్ అయింది. ‘మై లవ్ ఈజ్ గాన్’ అనే సాంగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ ఆర్య 2 చిత్రం థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. 

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

(allu-arjun | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు