BIGG BOSS 9 TELUGU: బంపర్ ఆఫర్ కొట్టేసిన ఆర్మీ మ్యాన్ .. ఫస్ట్ కామనర్ గా బిగ్ బాస్ లోకి!

బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రారంభమైంది. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఆర్మీ జవాన్ పవన్ కళ్యాణ్ మొట్ట మొదట బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నాడు.  

New Update
BIGG BOSS 9 TELUGU

BIGG BOSS 9 TELUGU

BIGG BOSS 9 TELUGU:  బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ సారి సెలబ్రెటీస్ వర్సెస్ కామనర్స్ గా బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగనుంది. ఇప్పటికే సెలబ్రెటీస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు 'అగ్ని పరీక్ష' ద్వారా ఎంపికైన మొదటి  కామన్ మ్యాన్ ని అనౌన్స్ చేశారు. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఆర్మీ జవాన్ పవన్ కళ్యాణ్ మొట్ట మొదటగా  బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నాడు.

ఇదిలా ఉంటే కామన్ మ్యాన్ ఎంపిక కోసం నిర్వహించిన 'అగ్ని పరీక్ష' షోలో కూడా పవన్ ప్రతీ టాస్క్ అద్భుతంగా ఆడుతూ, తెలివిగా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా.. చాలా సింపుల్ గా ఉండడంతో ప్రేక్షకులకు బాగా నచ్చేశాడు. 

ఎవరీ పవన్ కళ్యాణ్

ప్రస్తుతం ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్... బిగ్ బాస్ షో పై ఉన్న ఇష్టంతో షోలో పాల్గొనేందుకు వచ్చాడని సమాచారం. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పవన్ దేశం కోసం పోరాడారట. ఇలా ఒక ఆర్మీ జవాన్ బిగ్ బాస్ హౌజ్ లోకి రావడం ఇదే తొలిసారి.  

ఇక పవన్ కళ్యాణ్ తో పాటు 'అగ్నిపరీక్ష' లో  జ్యురీ సభ్యులను మెప్పించిన హరిత హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు. జ్యురీ మెంబర్ బిందు మాధవి హరీష్ పేరును అనౌన్స్ చేశారు. బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం రావడంతో తన కల సాకారం అయినట్లు హరీష్ స్టేజ్ పై భావోద్వేగానికి గురయ్యారు. 

నెక్స్ట్ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి సోషల్ మీడియా రీల్స్ ద్వారా పాపులరైన డీమోన్ పవన్ హౌజ్ లోకి వెళ్ళాడు. తాను జపనీస్ నవలలు ఎక్కువగా చదువుతానని.. అందులో క్యారెక్టర్స్ వలే వీక్ నుంచి స్ట్రాంగ్ గా ఎదుగుతూ ఉండాలని డీమోన్ పవన్ అనే పేరును పెట్టుకున్నట్లు  తెలిపాడు పవన్. 

పవన్ తర్వాత కామనర్స్ నుంచి దమ్ము శ్రీజ హౌస్ లోకి అడుగుపెట్టింది. 'అగ్నిపరీక్ష' జ్యురీ నవదీప్ శ్రీజ పేరును అనౌన్స్ చేశారు.  ఇక శ్రీజ తన పేరును అనౌన్స్ చేయగానే ఎప్పటిలాగే చకచకా మాట్లాడుతూ నాగార్జునతో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది.  అగ్నిపరీక్ష దాటుకొని హౌజ్ లోకి ఎలా వచ్చానో.. అలాగే ఆడి  సీజన్ విన్నర్ కూడా  అవుతానని కాన్ఫిడెంట్ గా చెప్పింది శ్రీజ.  

నెక్స్ట్ ప్రియా శెట్టి హౌజ్ లోకి వెళ్ళింది. డాక్టర్ గా వర్క్ చేస్తున్న ప్రియ బిగ్ బాస్ పై  ఉన్న ఇష్టంతో హౌజ్ లోకి వెళ్లాలని అనుకుంది. దానికి తగ్గట్లే 'అగ్నిపరీక్ష' ప్రక్రియలో తన ఆట తీరు, మాటతీరుతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకొని హౌజ్ లోకి అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది.  చివరిగా కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి మర్యాద మనీష్ ఇంట్లోకి వెళ్ళాడు. 

Advertisment
తాజా కథనాలు