'Devara' సాంగ్ ను తెలుగులో అద్భుతంగా పాడిన ఆలియా భట్.. వీడియో వైరల్

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.. ఎన్టీఆర్, ఆలియా భట్ లతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇందులో ఆలియా భట్ 'దేవర'లోని 'చుట్టమల్లే' సాంగ్ ను తెలుగులో పాడి అదరగొట్టింది. ఇది తన ఫేవరెట్ సాంగ్ అని.. ఆ సాంగ్ ను ఎన్టీఆర్ ముందే పాడింది. దాంతో తారక్ సైతం ఫిదా అయ్యారు.

author-image
By Anil Kumar
New Update

Alia Bhatt : కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీయార్ (Jr. NTR), జాన్వీకపూర్‌‌లు హీరోహీరోయిన్లగా నటించిన మూవీ దేవర. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాలో తారక్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 27న దేవర పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్స్ ఆడియన్స్ లో భారీ హైప్ పెంచింది. 

ఇక మూవీ టీమ్ సైతం ప్రమోషన్స్ ను భారీగానే చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఎన్టీఆర్, ఆలియా భట్ లతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఆలియా లీడ్ రోల్ లో 'జిగ్ర' అనే హిందీ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా అక్టోబర్ 11 న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే నిర్మాత కరణ్ జోహార్ రెండు సినిమాలకు కలిపి ఒకే ఇంటర్వ్యూలాగా ప్లాన్ చేశారు. 

Also Read : 'ఆచార్య' డిజాస్టర్.. చిరుపై కొరటాల శివ షాకింగ్ కామెంట్స్

ఆలియా పాటకు తారక్ ఫిదా..

అందుకు సంబంధించిన ఫుల్ వీడియో తాజాగా యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఇందులో ఆలియా భట్ 'దేవర' సినిమాలోని 'చుట్టమల్లే' సాంగ్ ను తెలుగులో పాడి అదరగొట్టింది. దేవర లో ఇది తన ఫేవరెట్ సాంగ్ అని.. ఆ సాంగ్ ను ఎన్టీఆర్ ముందే అద్భుతంగా పాడింది. దాంతో తారక్ సైతం ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్..' ఆలియా సింగింగ్ సూపర్ అని, తెలుగులో అద్భుతంగా పాడిందని' కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  

Also Read :  'ఆచార్య' డిజాస్టర్.. చిరుపై కొరటాల శివ షాకింగ్ కామెంట్స్

'RRR' తో టాలీవుడ్ ఎంట్రీ..

ఆలియా భట్ 'RRR' మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడిగా సీత పాత్రలో అద్భుత నటన కనబర్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. నిజానికి 'దేవర' లోనూ తారక్ సరసన ఆమెనే నటించాల్సింది. కానీ ఏమైందో తెలీదు, ఆమె ప్లేస్ లో జాన్వీ కపూర్ ను తీసుకున్నారు. 

Also Read :  క్లాస్‌ అయినా మాస్‌ అయినా బాస్‌ బ్రేక్‌ డ్యాన్స్‌ వేస్తే బాక్సులు బద్దలవ్వాల్సిందే..!

#tollywood #devara #alia-bhatt #ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి