కోలీవుడ్ స్టార్ అజిత్ కు కారు రేసింగ్ అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఓ వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే కార్ రేసింగ్ పై తనకున్న ఫ్యాషన్ ను వదలకుండా రేసింగ్ లో ఉన్నత శిఖరాలను అందుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. ఇప్పటికే ‘అజిత్ కుమార్ రేసింగ్’ అనే పేరుతో ఒక టీంను ఏర్పాటు చేశాడు.
ప్రెజెంట్ ఆయన దుబాయ్ లో ఉన్నారు. అక్కడ జరుగుతున్న రేసింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. నేడే దుబాయ్ వేదికగా రేసింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే అజిత్ కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అజిత్ ఈ రేస్ కోసం రెడీ అవుతుండగా.. గ్రౌండ్ లో అభిమానులు ఆయన్ని చూసి కేకలు వేస్తారు. అది గమనించి అజిత్.. తన ఫ్యాన్స్ కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు.
Also Read : 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ
Flying Kisses From #AjithKumar Sir To His Fans! 😍🙌#AjithKumarRacing pic.twitter.com/tMXOU9rLX0
— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) January 11, 2025
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ ఫ్యాన్స్ ఈ వీడియోను నెట్టింట తెగ ట్రెండ్ చేస్తూ ఈ రేసింగ్ లో ఆయన సక్సెస్ కావాలని కోరుతున్నారు. కాగా ఫ్యాన్స్ తో పాటూ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ఎక్స్ వేదికగా అజిత్ కు విషెస్ తెలిపారు.
Also Read: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు
Wishing the best, dear #AjithKumar Sir, for the 24H Series in Dubai! Your unwavering passion and dedication continue to inspire us all. May you achieve immense success in this as well, Sir ❤️❤️🤗 pic.twitter.com/AU4pKBwRHa
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 11, 2025
' దుబాయ్‌లో జరిగే 24H సిరీస్‌కి శుభాకాంక్షలు. డియర్ అజిత్‌కుమార్ సర్.. మీ అచంచలమైన అభిరుచి, అంకితభావం మా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.ఈ రేసింగ్ లో మీరు అపారమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా..' అంటూ తెలిపారు.