46 ఏళ్ళ సీనియర్ హీరోయిన్‌కు యంగ్ హీరోతో రెండో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి నటి మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తల పై ఆందోళన వ్యక్తం చేశారు. ఓ హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరగడంపై స్పందించారు. ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేయాలని కొంతమంది ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు అంటూ వాపోయారు. By Archana 16 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update Actress meena షేర్ చేయండి Actress Meena : అలనాటి నటి మీనా హీరోయిన్ అందం, అభినయంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొన్నాళ్లుగా మీనా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని, ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉన్నారంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఆమె భర్త అకాల మరణం పొందడంతో నెటిజన్లు రకరకాల వాదనలకు తెరలేపారు. కాగా, ఈ రూమర్స్ పై నటి మీనా ఎట్టకేలకు స్పందించారు. Also Read: పెళ్ళైన నాలుగు నెలలకే రాధికా ఆ విషయంలో సంచలన నిర్ణయం..! రెండో పెళ్లి పై మీనా క్లారిటీ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల పై ఆందోళన వ్యక్తం చేశారు. మీనా మాట్లాడుతూ.. కొంతమంది సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్ని హైలైట్ చేయాలని, ఏదో ఒకటి రాయాలని ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. ముఖ్యంగా హీరో ధనుష్ ని ట్యాగ్ చేస్తూ పిచ్చి పిచ్చి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. వార్తలు లేకపోతే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారా..? ప్రస్తుతం నేను దేని గురించి ఆలోచించడం లేదు. ఒంటరి జీవితాన్ని గడపడానికే ప్రయత్నిస్తాను. నా కూతురు నైనిక విద్యాసాగర్ భవిష్యత్తు మాత్రమే నాకు ముఖ్యం. జీవితం ఎలా వెళితే.. అలా ముందుకు సాగుతాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో రెండో పెళ్లి రూమర్స్ కు చెక్ పెట్టింది మీనా. Also Read: పుష్ప-2 గురించి అదిరే అప్‌డేట్ ఇచ్చిన రష్మిక.. ఫొటోలు వైరల్ Also Read : పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే? Also Read: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్ #actress-meena #tollywood #second-marriage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి