/rtv/media/media_files/2025/01/02/FQFt3Q25Yu5J3IDb7xRf.jpg)
Ileana D'Cruz
Ileana : టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా తన రెండవ ప్రెగ్నెసీ రివీల్ చేశారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా.. గతేడాది ప్రతి నెలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక క్షణాలను గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అక్టోబర్ నెల అందరి దృష్టిని ఆకర్షించింది. అక్టోబర్ లో ఇలియానా తన ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను పట్టుకుని ఎమోషనల్‌గా కనిపించింది. దీంతో ఆమె రెండో సారి తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్లు ఇలియానాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఇలియానా, మైఖేల్ దంపతులకు 2023 ఆగస్టులో మొదటి సంతానంగా బాబు పుట్టాడు.
Also Read: Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!
స్టార్ హీరోయిన్ క్రేజ్
నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇలియానా అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంత చేసుకుంది. ఆ సమయంలో ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాణిస్తున్న హీరోలందరి సరసన నటించింది ఇలియానా. దేవదాస్, పోకిరి, జల్సా వంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది. టాలీవుడ్ లో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే .. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 2012-18 వ్యవధిలో పలు హిందీ సినిమాల్లో చేసింది. కానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో మళ్ళీ టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఇలియానా చివరిగా తెలుగులో హిందీలో కూడా పలు సినిమాలు చేసింది. చివరిగా తెలుగులో ఇలియానా రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేసింది. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ తో బిజీ అయిపొయింది.
Also Read: RGV: వివాదాలకు పోను, అమ్మాయిల జోలికి అస్సలే పోను.. RGV న్యూ ఇయర్ ట్వీట్ !
Also Read: RGV: వివాదాలకు పోను, అమ్మాయిల జోలికి అస్సలే పోను.. RGV న్యూ ఇయర్ ట్వీట్ !