/rtv/media/media_files/2025/04/10/iVenGFY18z6tTCqBWU4E.jpg)
darshan Bengaluru court
Actor Darshan: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్ కీలక నిందితుడిగా ఉన్న కన్నడ హీరో దర్శన్ పై బెంగళూరు కోర్టు మంగళవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణకు హాజరు కాకపోవడంపై కోర్టు ఫైర్ అయింది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకడి ఉన్న దర్శన్ నడుం నొప్పి కారణంగా విచారణకు హాజరు కాలేకపోయినట్లు ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానంలో తెలిపారు. అయితే అదే రోజు సాయంత్రం కన్నడ చిత్రం వామన మూవీ ఈవెంట్‌కు హాజరయ్యారు. దీంతో హైకోర్టు దర్శన్ పై ఫైర్ అయింది.
A Bengaluru court expressed strong displeasure over Kannada actor Darshan’s absence during a hearing in the ongoing murder case where he is one of the key accused.
— IndiaToday (@IndiaToday) April 10, 2025
The Civil and Sessions Judge, hearing the high-profile case, warned that no further exemptions would be entertained… pic.twitter.com/asee0qoPKY
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
హై ప్రొఫైల్ కేసును విచారిస్తున్న సివిల్, సెషన్స్ జడ్జి, ఇకపై ఎటువంటి మినహాయింపులు ఇవ్వబోమని హెచ్చరించారు. భవిష్యత్తులో జరిగే అన్ని విచారణలకు తప్పనిసరిగా హాజరు కావాలని,ఇష్టమొచ్చినట్లుగా చేయవద్దని ఆయన్ను ఆదేశించారు. కాగా ఈ కేసులోని పదిహేడు మంది నిందితుల్లో ప్రధాన నిందితురాలు, దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడతో సహా పదహారు మంది కోర్టు ముందు హాజరయ్యారు.
Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
దర్శన్ పై కేసు
చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకస్వామి హత్య కేసులో 47 ఏళ్ల కన్నడ నటుడిని 2024జూన్ 11 న అరెస్టు చేశారు. జూన్ 9న బెంగళూరులోని మురికినీటి కాలువ సమీపంలో బాధితుడి మృతదేహం లభ్యమైంది. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుకస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపాడని, అది నటుడిని ఆగ్రహానికి గురిచేసి రేణుకస్వామిని హత్య చేశాడని విచారణలో తేలింది. డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్, పవిత్ర గౌడలకు బెయిల్ మంజూరు చేసింది.
Also Read : Akkineni Akhil: కాబోయే భార్యతో అఖిల్ వెకేషన్.. బీచ్ సైడ్ ఫొటో వైరల్!