Aamir khan In Coolie: ఎందుకింత సస్పెన్స్.. ఇంతకీ అమీర్ ఖాన్ ఉన్నట్టా? లేనట్టా..?

సూపర్ స్టార్ రజినికాంత్, లోకేష్ కానగరాజ్ కాంబోలో వస్తున్న కూలీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని 2025 మే 1న విడుదలకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. 

New Update
Aamir khan In Coolie

Aamir khan In Coolie

Aamir khan In Coolie: సూపర్ స్టార్ రజినికాంత్(Rajinikanth), టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్(Lokesh Kanagaraj) కాంబోలో వస్తున్న కూలీ మూవీ షూటింగ్ ఎట్టకేలకు కంప్లీట్ చేసుకుంది. ఇందులో భారీ స్టార్ కాస్ట్ ఉన్న విషయం తెల్సిందే. అసలే సూపర్ స్టార్ సినిమా అందులోనూ నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి బడా యాక్టర్లు నటిస్తున్నారు. దింతో ఈ మూవీ పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా కనిపించనున్నారు అని కొన్ని వార్తలు వినిపించాయి.

Also Read:నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!

Also Read:రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

కానీ, ఈ విషయంపై మేకర్స్ ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, టీజర్, సాంగ్స్ ఎందులో కూడా అమీర్ ఖాన్ కనపడలేదు. ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అయితే రీసెంట్ గా లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసారు. అందులో లోకేష్ తో పాటు అమీర్ ఖాన్ కూడా ఉండడం విశేషం. కానీ అది కచ్చితంగా కూలీ మూవీ లొకేషన్ లో దిగిన ఫోటోనా  లేదా వేరే ఏదైనా సినిమా గురించి లోకేష్ , అమీర్ కలిసారా అన్న విషయం పై క్లారిటీ లేదు. ఇంతవరకు కూలీ లో అమీర్ ఖాన్ పాత్ర పై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఉంది. కానీ అమీర్ ఖాన్ ఉన్నారా లేదా అన్న విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. ఏదిఏమైనప్పటికీ దీనిపై ఒక క్లారిటీ రావాలంటే లోకేష్ నోరు విప్పక తప్పదు. 

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో కూలీ..

కూలీ మూవీ గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా, సన్ పిక్చర్స్ బ్యానర్ లో  కళానిధి మారన్ నిర్మించారు. రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్,  జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటించారు. మే 1 2025న ఈ మూవీ భారీ విడుదలకు సిద్ధమైంది.

Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..

Advertisment
తాజా కథనాలు