Venky - Trivikram: వెంకీ - త్రివిక్రమ్ కాంబో ఫిక్స్..

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో ఓ ఫ్యామిలీ డ్రామా రాబోతోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ హిట్‌ తరువాత ఎన్నో కథలు విన్న వెంకీ త్రివిక్రమ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ వెంకీ చిత్రాన్ని పూర్తి చేసి తర్వాత బన్నీతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు .

New Update
Venky - Trivikram

Venky - Trivikram

Venky - Trivikram: టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఎదురు చూసిన కాంబో, చివరికి నిజమవుతోంది. స్టార్ హీరో వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి త్వరలో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లేశ్వరి' వంటి హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించగా, ఆ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కానీ త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకీ సినిమా చేయలేదు. మధ్యలో అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, అవన్నీ వర్కౌట్ కాలేకపోయాయి.

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

అయితే ఇప్పుడు వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం ఖరారైంది. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ హిట్‌ తరువాత, వెంకటేష్ తన తదుపరి సినిమాపై ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. ఎన్నో కథలు విన్న తరువాత, త్రివిక్రమ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ కు ముందు అట్లీ- బన్నీ సినిమా మొదలవడంతో, త్రివిక్రమ్‌కి  ఖాళీ సమయం లభించింది. ఈ సమయంలో వెంకటేష్ సినిమా పూర్తి చేసి, ఆ తర్వాత బన్నీ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

వెంకటేష్- త్రివిక్రమ్ కలయికలో రాబోయే సినిమా ఫ్యామిలీ డ్రామాగా రూపొందనుందని టాక్. ఫ్యామిలీ డ్రామా కాబట్టి షూటింగ్ పనులు వేగంగా ముగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరున్న ఈ కాంబోపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు