6 Years of Saaho: ఆరేళ్లు పూర్తి చేసుకున్న ప్రభాస్ బాక్సాఫీస్ మాస్టర్ పీస్ "సాహో"..!

బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ యాక్షన్ థ్రిల్లర్ "సాహో" సినిమా విడుదలై 6 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సినిమా పై మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది.

New Update
6 years for saaho

6 years for saaho

6 Years of Saaho: బాహుబలి(Baahubali) తర్వాత ప్రభాస్(Prabhas) నుంచి వచ్చే ప్రతి సినిమా మీద అభిమానుల్లో, ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. అలాంటి టైమ్ లో యంగ్ డైరెక్టర్ సుజీత్(Director Sujeeth) దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ "సాహో". ఈ సినిమా వచ్చి ఇప్పటికి 6 ఏళ్ళు పూర్తయ్యింది అక్టోబర్ 30, 2019న విడుదలైన ఈ   సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను UV క్రియేషన్స్, T-సిరీస్ నిర్మించింది.

Also Read:ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే పోస్టర్.. 'రాజాసాబ్' నుంచి అదిరే అప్డేట్!

భారీ ఓపెనింగ్.. 

సినిమా విడుదలైన మొదటి రోజు నుండి ప్రభాస్ స్టార్డం‌తో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు తో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. అంచనాల మేరకు కాకపోయినా, సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹400 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించి ప్రభాస్ మార్కెట్‌కు మరో సారి నిదర్శనంగా నిలిచింది.

Also Read: ఇదేం ట్విస్ట్ 'రాజా సాబ్'.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా.. !

కథలో లోపమా..?

అయితే అప్పట్లో "సాహో" సినిమాకి వచ్చిన టాక్ ఎలా ఉందంటే కథలో బలం లేదని, మూడు గంటల పాటు సాగదీసినట్టు ఉందని, సినిమా స్టోరీ యాక్షన్‌తో నిండి ఉన్నా కూడా కథలో లాజిక్ మిస్ అయ్యిందని, ఎమోషన్స్ వర్క్ అవుట్ కాలేదని ఇలా అనేక కారణాలతో చాలా మంది నిరాశపడ్డారు.

ప్రభాస్ నటనపై కూడా రెండు రకాల స్పందనలు వచ్చాయి. చాలా మంది ఆయన డెడికేషన్‌ను మెచ్చుకున్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఎక్స్ప్రెషన్స్ లేకుండా నటించాడని అభిప్రాయపడినవారూ ఉన్నారు. సాహో సినిమాలో నిండా యాక్షన్, చేజ్ సీన్లు కొనసాగుతూనే ఉంటాయి. వాటి మధ్యలో కథ ఎక్కడుందో అని అడిగే పరిస్థితి ఏర్పడింది.

Also Read:డార్లింగ్ మామూలోడు కాదుగా.. 'రాజాసాబ్' పార్ట్ 2 కూడా..!

డజన్ల కొద్ది విలన్లు.. 

ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలు ఎక్కువగా ఉండటం, కానీ వాటికి తగినట్టుగా డెవలప్‌మెంట్ లేకపోవడం మరో నెగటివ్ పాయింట్. టినూ ఆనంద్ నుంచి చెంకీ పాండే వరకు, మందిరా బేడీ, నీల్ నితిన్ ముఖేష్ వరకూ చాలామంది విలన్లు ఉన్నా, వాళ్లకి సరైన ప్రాధాన్యత దక్కలేదు.

దర్శకుడు సుజీత్ మాత్రం తన సినిమాపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ  "నేను, ప్రభాస్ గారు చాలా కష్టపడ్డాం. ఇది పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇది బాహుబలి కాదు, అలాగే అలాంటి సినిమా చేయాలని మేము ప్రయత్నించలేదు. ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తున్నారంటే అది మాకు ఓ విజయమే," అని అన్నారు. అలాగే, తనపై వస్తున్న విమర్శలు వల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, అయితే ప్రభాస్, నిర్మాతలు తనను ఆదరించారని చెప్పుకొచ్చాడు.

Also Read:ప్రభాస్ "రాజా సాబ్" లో భారీ సర్ ప్రైజ్! ఐటమ్ నెంబర్ కోసం స్టార్ హీరోయిన్ రంగంలోకి

ఏది ఏమైనప్పటికీ  "సాహో" లాంటి ఒక పెద్ద యాక్షన్ సినిమాకి రిజల్ట్ ఎలా ఉన్నా కానీ వసూళ్ల పరంగా చూస్తే మాత్రం, ఇది ప్రభాస్ స్టామినాకు తీసిపోని విధంగా రికార్డు కలెక్షన్లు సాధించి, ప్రభాస్ బాక్సాఫీస్ సత్తా ఏంటో నిరూపించింది.

Advertisment
తాజా కథనాలు