Child Artist: "100% లవ్" బుడ్దోడు ఇప్పుడు ఎంత హ్యాండ్సమ్ అయ్యాడో చూస్తే షాక్! ఆ సినిమాతో ఎంట్రీ

2011లో నాగచైతన్య- తమన్నా జంటగా వచ్చిన 100% లవ్ సినిమాలో బూరె బుగ్గలు వేసుకొని చలాకీ డైలాగులు కొడుతూ కనిపిస్తాడు. ఈ బుడ్డోడు ఇప్పుడు గుర్తుపట్టనంతగా మారిపోయాడు.

New Update
child artist Nikhil Abburi

child artist Nikhil Abburi

చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన పిల్లలు పెద్దయ్యాక ఏమి చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఆ బుజ్జి ముఖాలు పెద్దయ్యాక ఎలా మారిపోయాయి? అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. చెప్పాలంటే కొన్ని సినిమాల్లో హీరోలతో సమానంగా  చైల్డ్ ఆరిస్ట్ పాత్రలు ఆదరణ పొందుతుంటాయి. దీనికి బెస్ట్ ఉదాహరణ తేజ సజ్జా! ఇంద్ర సినిమాలో చిరంజీవి చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన తేజ సూపర్ ఫేమ్ తెచ్చుకున్నాడు. అలా చైల్డ్ ఆరిస్టుగా పాపులరైన  తేజ.. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు. రీసెంట్ హనుమాన్ సినిమాతో రూ. 100 కోట్ల హిట్టు కొట్టాడు.

ఇలా తేజ సజ్జా లానే చైల్ ఆరిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న మరో కుర్రాడు నిఖిల్ అబ్బూరి. 2011లో నాగచైతన్య- తమన్నా జంటగా వచ్చిన 100% లవ్ సినిమా(100 % Love Child Artist) లో బూరె బుగ్గలు వేసుకొని చలాకీ డైలాగులు కొడుతూ కనిపిస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ మిర్చి సినిమాలో కమెడియన్ సత్యం రాజేష్ ని తన బుజ్జి బుజ్జి డైలాగులతో ఆటపట్టిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రామ్ పోతినేని  'గణేష్' సినిమాలో కూడా తన పాత్రతో అలరించాడు. అలా  చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ పాత్రలతో అలరించిన ఈ బుడ్డోడు ఇప్పుడు గుర్తుపట్టనంతగా మారిపోయాడు.

Nikhil Abburi
Nikhil Abburi

సినిమాల్లో లీడ్ క్యారెక్టర్లు చేసే స్థాయికి ఎదిగాడు.  చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు పెద్దవాడై మళ్లీ వెండితెరపై మెరుస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో ఎక్కడ చూసిన ఈ బుడ్డోడి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

Nikhil Abburi child artist
Nikhil Abburi child artist

'లిటిల్ హార్ట్స్' సినిమాతో.. 

90's వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా నటిస్తున్న 'లిటిల్ హార్ట్స్'  సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నిఖిల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలవగా.. హీరో పక్కనే ఉన్న నిఖిల్ చూసి చాలా మంది ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోయారు. అంతలా మారిపోయాడు నిఖిల్. ఇటీవలే  మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ జరగగా.. చీఫ్ గెస్ట్ గా హాజరైన డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా నిఖిల్ చూసి ఆశ్చర్యపోయారు. ''100 %లవ్ సినిమాలో చికెన్ తినేది నువ్వే కదా.. ఇప్పుడు గడ్డాలు, మీసాలతో గుర్తుపట్టలేకుండా మారిపోయావు''  అంటూ సరదాగా మాట్లాడారు. 'లిటిల్ హార్ట్స్' సినిమాలో నిఖిల్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. టీజర్ చూస్తుంటే.. హీరో మౌళితో సమానమైన క్యారెక్టర్ పడినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత నిఖిల్ పేరు గట్టిగానే వినిపించేలా ఉంది. 

సాయి మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అదిత్య హాసన్ నిర్మిస్తున్నారు. సింజిత్ ఎర్రమిల్లి మ్యూజిక్ అందించారు. ఇందులో ఫీమేల్ లీడ్ గా శివానీ నగారం హీరోయిన్ గా నటిస్తోంది. రాజీవ్ కనకాలా, అనిత చౌదరీ, సత్య కృష్ణనన్, ఎస్.ఎస్. కంచి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: OG MOVIE: పవన్ 'OG'  నైజాం హక్కుల కోసం దిల్ రాజు భారీ ప్లాన్ ! అంత మొత్తం పెడుతున్నారా?

Advertisment
తాజా కథనాలు