Yediyurappa: ప్రస్తుతం కర్ణాటక అంతా లైంగిక వేధింపుల కేసులతో మునిగి తేలుతోంది. మొన్నటి వరకు దేవెగౌడ మనువడు ప్రజ్వల్ దేవెగౌడ్ కేసుతో దద్ధరిల్లింది. ఇప్పుడు మరో మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. పోక్సో కేసు విచారణ కింద కర్ణాటక ఎక్స్ సీఎం యడ్యూరప్పకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీని విచారణకు కూడా ఆయన హాజరవనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న యడ్యూరప్ప అక్కడి నుంచి వచ్చాక విచారణకు హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. మాజీ సీఎం యడ్యూరప్ప 17ఏళ్ళ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందే ఇవి వెలుగులోకి వచ్చాయి.
తాము మోసపోయామంటూ బాధితురాలు, ఆమె తల్లి యడ్యూరప్పను కలిశారు. ఆ సమయంలో యడ్యూరప్ప బాధితురాలిని బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళి దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఫిర్యాదు మేరకే యడ్యూరప్ప మీద పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. దీని మీద సీఐడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అయితే యడ్యూరప్ప మీద ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆమె ఇటీవలే క్యాన్సర్‌తో మరణించారు. కానీ బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ ఇదివరకే రికార్డు చేసింది. ఇదిలా ఉంటే యడ్యూరప్ప మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని కొట్టిపడేశారు.
ఎవరో తన మీద కావాలని నిందలు మోపుతున్నారని అన్నారు. యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా నాలుగు ఆసర్లు పని చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. గతేడాది నవంబరులోనే ఈ బాధ్యతల నుంచి ఆయనను తొలగించి...యడ్యూరప్ప కుమారుడికి అప్పగించింది బీజేపీ హై కమాండ్. ప్రస్తుతం యడియూరప్ప భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
Also Read:Andhra Pradesh: రేపటిలోగా మంత్రులకు శాఖల కేటాయింపు-చంద్రబాబు