World Cup 2023: ఇంత బ్యాడ్ లక్ ఉన్న జట్టు మరొకటి ఉండదేమో..

సౌత్ ఆఫ్రికా జట్టును బ్యాడ్ లక్ వీడటం లేదు. ఏడోసారి నాకౌట్ దశలో ఓడిపోయి ఫైనల్స్ కు చేరని జట్టుగా...చోకర్స్ గా అపవాదు మూటగట్టుకుంటూనే ఉన్నారు.

World Cup 2023: ఇంత బ్యాడ్ లక్ ఉన్న జట్టు మరొకటి ఉండదేమో..
New Update

South Africa: ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడతారు. పెద్ద పెద్ద టీమ్ లను లీగ్ దశలో మట్టి కరిస్తారు. నాకౌట్ కు చేరుకుంటారు. కానీ అక్కడ వాళ్ళకు ఏదో అయిపోతోంది. అప్పటి వరకూ చాలా బాగా ఆడినవారు కూడా చెత్త ప్రదర్శన చేస్తారు. ఇదీ సౌతాఫ్రికా పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడుసార్లు సెమీస్ లో ఓడిపోయి చోకర్స్ గా నిలిచిపోయింది.
దక్షిణాఫ్రికా 1992,1996, 1999, 2007, 2011,2015, 2023లలో సెమీ ఫైనల్స్ లో ఓడిపోయి వరల్డ్ కప్ కలను నెరవేర్చుకోలేకపోయింది.

Also Read:ఉత్తరం అయిపోయింది…దక్షిణ మీద పడ్డ ఇజ్రాయెల్

ప్రపంచకప్‌ చరిత్రలో ఓ సెమీస్‌లో లాన్స్‌ క్లుసెనర్‌ (Lance Klusener) చివరి బంతికి రనౌట్‌ కావడం... మరో సెమీస్‌లో ఏబీ డివిలియర్స్‌ పరాజయంతో కంటతడి పెట్టుకున్న క్షణాలను ప్రపంచ క్రికెట్‌ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇప్పుడు వీటన్నింటినీ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాలని భావించిన దక్షిణాఫ్రికా మరోసారి ఫైనల్‌ చేరలేదు. 1992లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో వర్షం కారణంగా డక్‌ వర్త్‌ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికా ఇంటి ముఖం పట్టింది. 1999లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ టైగా ముగియడం ఇలా మహా సంగ్రామంలో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది. గత చరిత్రను ఈ ప్రపంచకప్‌లో అధిగమిస్తారని భావించినా ఈసారి అలాటిందేమీ జరగలేదు. దక్షిణాఫ్రికా మరోసారి నాకౌట్‌ దురదృష్టాన్ని అధిగమించలేకపోయింది.

ఇప్పుడు వరల్డ్‌కప్‌ (World Cup 2023) లో కూడా దక్షిణాఫ్రికా పోరాటం ​ముగిసింది. మరోసారి నాకౌట్స్‌ దశను సౌతాఫ్రికా దాటలేకపోయింది. ఈ ​మెగా టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్లో (Aus vs SA) 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఆఖరివరకు సఫారీ బౌలర్లు పోరాడినప్పటికీ విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యాన్నే ఉంచింది. కానీ తరువాత బౌలింగ్ చాలా కట్టుదిట్టంగా చేసింది. 47వ ఓవర్ వరకు ఆస్ట్రేలియాను తీసుకురాగలిగింది. ఆసీస్ బ్యాటర్లను ఆడనివ్వకుండా ప్రొటీస్ బౌలర్లు కట్టడి చేయగలిగారు. కానీ ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలు ఆ టీమ్ ఓటమికి కారణమయ్యాయి. మొత్తం టోర్నీలో దక్షిణాఫ్రికా టీమ్ ఈ సెమీస్ మ్యాచ్ లోనే అత్యంత చెత్త ఫీల్డింగ్ చేసింది.

#australia #south-africa #semi-finals #icc-world-cup-2023 #chockers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe