Wayanad Landslides: కేరళ ప్రజలకు అండగా కోలీవుడ్ స్టార్స్.. భారీ విరాళాలు ప్రకటించిన సూర్య, విక్రమ్

కేరళలోని వరద విపత్తులో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు తమిళ హీరోలైన చియాన్ విక్రమ్, సూర్య ముందుకొచ్చారు. ఈ మేరకు విక్రమ్ తన వంతుగా కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.20 లక్షలు, యాక్టర్ సూర్య-జ్యోతిక దంపతులు రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు.

New Update
Wayanad Landslides: కేరళ ప్రజలకు అండగా కోలీవుడ్ స్టార్స్.. భారీ విరాళాలు ప్రకటించిన సూర్య, విక్రమ్

Chiyaan Vikram - Suriya : కేరళలోని (Kerala) వయనాడు జిల్లా ప్రస్తుతం తీవ్ర వరదల బారిన పడింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున మెప్పాడి స‌మీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండ‌చ‌రియ‌లు (Wayanad landslides) విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 250 కిపైగా ధాటింది. ఇంకా వంద‌లాది మంది మ‌ట్టిదిబ్బ‌ల కింద చిక్కుకున్న‌ట్లు అధికారులు, పోలీసులు అంచనా వేస్తున్నారు. విపత్తులో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు తమిళ హీరోలైన చియాన్ విక్రమ్, సూర్య ముందుకొచ్చారు.

ఈ మేరకు తమ వంతుగా కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు కొంత డబ్బును విరాళంగా అందజేశారు. వీరిలో విక్రమ్ రూ.20 లక్షలు అందజేయగా.. మరో స్టార్ యాక్టర్ సూర్య-జ్యోతిక దంపతులు రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. కేరళలో ప్రస్థుత పరిస్థితిని చూస్తుంటే తనను ఎంతో కలచి వేసిందని సూర్య తెలిపారు. కేరళ రెస్క్యూ ఆపరేషన్‌ ద్వారా సాయం చేస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు.

Also Read : పెళ్లి పై నోరు విప్పిన ‘రాజా సాబ్’ హీరోయిన్.. ఏం చెప్పిందంటే?

ఈ ఘటనలో ప్రమాధానికి గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇక ఈ ఇద్దరు హీరోల గొప్ప మనసుకు ఫ్యాన్స్, నెటిజన్ ఫిదా అవుతూ..వీళ్ళ లాగానే మన టాలీవుడ్ హీరోలు సైతం భారీ మొత్తంలో విరాళాలు అందించి కేరళ వరద బాధితులకు అండగా నిలవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు