Allu Arjun: వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ సాయం.. రూ. 25 లక్షల విరాళం
కేరళ రాష్ట్రం వయనాడ్ విపత్తు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ విపత్తులో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తాజాగా తెలుగు హీరో అల్లు అర్జున్ తన వంతు సాయంగా రూ.25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించారు.