ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. రామోజీ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఆ తర్వాత కుటుంసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని అన్నారు. ఆయన మరణంతో తెలుగు జాతీ ఒక పెద్దదిక్కును కోల్పోయిందని పేర్కొన్నారు. రామోజీ కలలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ స్థాపించే సమయంలో ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడినంటూ ఆనాటి రోజులను గుర్తుకుచేసుకున్నారు.
Also read: రామోజీరావు దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి: ఉండవల్లి
శుక్రవారం రాత్రి రామోజీరావు అస్వస్థకు గురవ్వడంతో.. కుటంబ సభ్యులు ఆయన్ని నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 AM గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read: నీట్ కటాఫ్ మార్కులపై నేషనల్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ కీలక ప్రకటన!